Nerubari vaidenu nelamta nee vaadanigi

నేరుపరి వైతేను నెలఁత నీ వాతనికి
Language

(॥పల్లవి॥)
నేరుపరి వైతేను నెలఁత నీ వాతనికి
నారుకొన్న ప్రియముతో నయములే చూపవే

(॥నేరు॥)
సన్నలనే పతికి నిచ్చకురాలవై యుండవే
విన్నపాలు సేయకువే వేమారును
మిన్న కాతనికి మందెమేళముల మీరకువే
మన్నన సతులమీఁద మచ్చరము మానవే

(॥నేరు॥)
తలఁపులో మెలఁగవే తప్పులు వట్టకువే
చలము సాదించకువే సముకానను
అలుగకువే నీవు ఆతనితో నెప్పుడును
బలిమిఁ బెనఁగుతాను పంతము లాడకువే

(॥నేరు॥)
వూడిగాలు సేయవే వొద్దునే గాచుకుండవే
వేడుకలు నెరవవే విసువకువే
కూడె శ్రీవెంకటేశుఁడు కొంకక కడవలోన
మేడెపురతుల నిట్టె మెప్పించవే

(||pallavi||)
nerubari vaidenu nĕlam̐ta nī vādanigi
nārugŏnna priyamudo nayamule sūbave

(||neru||)
sannalane padigi nichchagurālavai yuṁḍave
vinnabālu seyaguve vemārunu
minna kādanigi maṁdĕmeḽamula mīraguve
mannana sadulamīm̐da machcharamu mānave

(||neru||)
talam̐pulo mĕlam̐gave tappulu vaṭṭaguve
salamu sādiṁchaguve samugānanu
alugaguve nīvu ādanido nĕppuḍunu
balimim̐ bĕnam̐gudānu paṁtamu lāḍaguve

(||neru||)
vūḍigālu seyave vŏddune gāsuguṁḍave
veḍugalu nĕravave visuvaguve
kūḍĕ śhrīvĕṁkaḍeśhum̐ḍu kŏṁkaga kaḍavalona
meḍĕburadula niṭṭĕ mĕppiṁchave