Nerubari tolle seli neevu nerajaanavu

నేరుపరి తొల్లె చెలి నీవు నెరజాణవు
Language

(॥పల్లవి॥)
నేరుపరి తొల్లె చెలి నీవు నెరజాణవు
యేరుపరచింకాఁ గతలేల చెప్పేవయ్యా

(॥నేరు॥)
మాఁటలు నీవాడితేనే మన్నించేవని తెలిసె
నాఁట గోరనూఁదితేను నవ్వేవని తెలిసె
చోటిచ్చి రమ్మంటేనే చొక్కించేవని తెలిసె
యేఁటికి నాపెకు బత్తి యెంత చెప్పేవయ్యా

(॥నేరు॥)
కొనచూపులఁ జూచితే కూడేవని తెలిసె
లనిచి చెక్కునొక్కితే నమ్మించేవని తెలిసె
చెనకఁగానే నీ చేతలన్నియుఁ దేలిసె
యెనసె నీతలఁపులు యేమి చెప్పేవయ్యా

(॥నేరు॥)
లలిఁ జెయివట్టితేనే లాలించేవని తెలిసె
మొలక చన్ను లంటితే మోహమంతయుఁ దెలిసె
యలమి శ్రీవేంకటేశ ఇంతి నిట్టె యేలితివి
యెలుగెఁత్తి నీవేడుక లెన్ని చెప్పేవయ్యా

(||pallavi||)
nerubari tŏllĕ sĕli nīvu nĕrajāṇavu
yerubarasiṁkām̐ gadalela sĕppevayyā

(||neru||)
mām̐ṭalu nīvāḍidene manniṁchevani tĕlisĕ
nām̐ṭa goranūm̐didenu navvevani tĕlisĕ
soḍichchi rammaṁṭene sŏkkiṁchevani tĕlisĕ
yem̐ṭigi nābĕgu batti yĕṁta sĕppevayyā

(||neru||)
kŏnasūbulam̐ jūside kūḍevani tĕlisĕ
lanisi sĕkkunŏkkide nammiṁchevani tĕlisĕ
sĕnagam̐gāne nī sedalanniyum̐ delisĕ
yĕnasĕ nīdalam̐pulu yemi sĕppevayyā

(||neru||)
lalim̐ jĕyivaṭṭidene lāliṁchevani tĕlisĕ
mŏlaga sannu laṁṭide mohamaṁtayum̐ dĕlisĕ
yalami śhrīveṁkaḍeśha iṁti niṭṭĕ yelidivi
yĕlugĕm̐tti nīveḍuga lĕnni sĕppevayyā