నేరుపరి ననుకోను నెరజాణ ననుకోను
(॥పల్లవి॥)
నేరుపరి ననుకోను నెరజాణ ననుకోను
యీరీతి నా హావభావా లింతెఱఁగఁడా
(॥నేరు॥)
మలసి తనతో నేను మాటాలాడనని దూరి
సెలవుల నవ్వితేనే సేనమాటలే
పిలిపించనని తాను బిగువులు నెరపీని
తలుపు దెరచితేనే తగుసన్నగాదా
(॥నేరు॥)
దగ్గరఁ గూచుండనంటా తమకించనంతలోనె
సిగ్గువడి వుండితేనె చేరివుండుటే
వొగ్గి తన్నుఁ జూడనంటా వొరట్లు వట్టీని
అగ్గమై యెదుటనుంటే అన్నియును గాదా
(॥నేరు॥)
ముందు కాఁగిలించనంటా మొనలెల్లఁ జూపీని
ఇందమని విడెమిచ్చు టిదియే అది
అందపు శ్రీవేంకటేశుఁ డలమేలుమంగ నేను
పొందితి మిద్దర మివి పోదులెల్లాఁగావా
(||pallavi||)
nerubari nanugonu nĕrajāṇa nanugonu
yīrīdi nā hāvabhāvā liṁtĕṟam̐gam̐ḍā
(||neru||)
malasi tanado nenu māḍālāḍanani dūri
sĕlavula navvidene senamāḍale
pilibiṁchanani tānu biguvulu nĕrabīni
talubu dĕrasidene tagusannagādā
(||neru||)
daggaram̐ gūsuṁḍanaṁṭā tamagiṁchanaṁtalonĕ
sigguvaḍi vuṁḍidenĕ serivuṁḍuḍe
vŏggi tannum̐ jūḍanaṁṭā vŏraṭlu vaṭṭīni
aggamai yĕduḍanuṁṭe anniyunu gādā
(||neru||)
muṁdu kām̐giliṁchanaṁṭā mŏnalĕllam̐ jūbīni
iṁdamani viḍĕmichchu ṭidiye adi
aṁdabu śhrīveṁkaḍeśhum̐ ḍalamelumaṁga nenu
pŏṁdidi middara mivi podulĕllām̐gāvā