నేరుపకువయ్య నాకు నీ విప్పు డొకటొకటె
(॥పల్లవి॥)
నేరుపకువయ్య నాకు నీ విప్పు డొకటొకటె
తారుకాణలైన నీ తలఁపులోదానను
(॥నేరు॥)
గోరికొన నూఁదజాల గుంపెన చూపఁగజాల
నేరము లెంచాఁజాల నిన్నుఁజూచి
వారివీరివలె నేను వాసులఁ బొరలఁజాల
చేరి నీ కేపొద్దు నేను సేవసేసేదానను
(॥నేరు॥)
మందెమేళములు నేర మనసు సొదించనేర
నిందలుగట్టఎగనేర నిన్నుఎజూచి
అదరివలె నే నీచే నానలు వెట్టించనేర
విందువలె వచ్చితే నీవేడుకలోదానను
(॥నేరు॥)
పెనఁగులాడఁగ నోప పెలుచుఁదనాల కొప
చెనకి నిన్నింత దూరు సేయఁగ నోప
యెనసితివి శ్రీవేంకటేశ నన్ను మన్నించి
మనుటకు నలమేలుమంగనైనదానను
(||pallavi||)
nerubaguvayya nāgu nī vippu ḍŏgaḍŏgaḍĕ
tārugāṇalaina nī talam̐pulodānanu
(||neru||)
gorigŏna nūm̐dajāla guṁpĕna sūbam̐gajāla
neramu lĕṁchām̐jāla ninnum̐jūsi
vārivīrivalĕ nenu vāsulam̐ bŏralam̐jāla
seri nī kebŏddu nenu sevasesedānanu
(||neru||)
maṁdĕmeḽamulu nera manasu sŏdiṁchanera
niṁdalugaṭṭæganera ninnuĕjūsi
adarivalĕ ne nīse nānalu vĕṭṭiṁchanera
viṁduvalĕ vachchide nīveḍugalodānanu
(||neru||)
pĕnam̐gulāḍam̐ga noba pĕlusum̐danāla kŏba
sĕnagi ninniṁta dūru seyam̐ga noba
yĕnasidivi śhrīveṁkaḍeśha nannu manniṁchi
manuḍagu nalamelumaṁganainadānanu