Nerisinaamdannidaanu neradanaalu

నేరిచినాఁడన్నిటాను నెరతనాలు
Language

(॥పల్లవి॥)
నేరిచినాఁడన్నిటాను నెరతనాలు
తారుకాణ లన్నియును తనవల్లఁ గంటిమే

(॥॥)
సెలవి నవ్వినవాఁడు చెక్కునఁ జెయ్యిడనేల
నెలకొన్నరాజసమె నెరపుఁగాక
నిలువుఁజెమటతోడ నీతితో నేకతమాడీ
చెలియరో వీనిజాడ చెప్ప నెట్టువచ్చునే

(॥॥)
తప్పక చూచినవాఁడు తలవూఁచి మెచ్చనేల
నెప్పునఁ గైవశమై మన్నించుఁగాక
చిప్పిలుసిగ్గులతోడఁ జెప్పీ నీకుఁ బ్రియములు
యిప్పు డీతనివిద్య లేమని నే నెంతునే

(॥॥)
కాఁగిట నించినవాఁడు కడుబునకొట్టనేల
చేఁగదేరేగుట్టుతోడఁ జెలఁగుఁగాక
ఆఁగుచు కడపరాయఁడై శ్రీ వేంకటేశుఁడు
వీఁగఁడు యీవేసా లెట్టు వెలయించవచ్చునే

(||pallavi||)
nerisinām̐ḍanniḍānu nĕradanālu
tārugāṇa lanniyunu tanavallam̐ gaṁṭime

(||||)
sĕlavi navvinavām̐ḍu sĕkkunam̐ jĕyyiḍanela
nĕlagŏnnarājasamĕ nĕrabum̐gāga
niluvum̐jĕmaḍadoḍa nīdido negadamāḍī
sĕliyaro vīnijāḍa sĕppa nĕṭṭuvachchune

(||||)
tappaga sūsinavām̐ḍu talavūm̐si mĕchchanela
nĕppunam̐ gaivaśhamai manniṁchum̐gāga
sippilusigguladoḍam̐ jĕppī nīgum̐ briyamulu
yippu ḍīdanividya lemani ne nĕṁtune

(||||)
kām̐giḍa niṁchinavām̐ḍu kaḍubunagŏṭṭanela
sem̐gadereguṭṭudoḍam̐ jĕlam̐gum̐gāga
ām̐gusu kaḍabarāyam̐ḍai śhrī veṁkaḍeśhum̐ḍu
vīm̐gam̐ḍu yīvesā lĕṭṭu vĕlayiṁchavachchune