Neribevu maagu nidi needudodanu

నేరిపేవు మాకు నిది నీటుతోడను
Language

(॥పల్లవి॥)
నేరిపేవు మాకు నిది నీటుతోడను
నీ రచన నింత విచ్చి నేనాడవలెనా

(॥నేరి॥)
సిగ్గు గలదైతే నిన్నుఁ జేవట్టి తీసునా నీవు
వెగ్గళించినా దా విఱ్ఱవీఁగుఁ గాక
కగ్గులేని బత్తిదంటా కడు నాతోఁ బొగడేవు
నిగ్గుల యిందలిమేలు నీసత్య మెఱఁగదా

(॥నేరి॥)
యింగిత మెఱిఁగినది యెదురు నీతో నవ్వునా
సంగతి నిన్ను బొమ్మల జంకించుఁ గాక
చెంగట నీపె జూపి చేసన్నలు సే సేవు
అంగడి ఆడికాఁడవు అదెఱఁగవా

(॥నేరి॥)
పొందెరిఁగినవి యైతే పొదుగంగఁ జూచునా
కందువల నుండే నిన్నుఁ గలసుఁగాక
యిందులో శ్రీ వేంకటేశ యీడుకు నన్నుఁ గూడితి
వందాలు మాలోనిని నీ యరచేతివే కావా

(||pallavi||)
neribevu māgu nidi nīḍudoḍanu
nī rasana niṁta vichchi nenāḍavalĕnā

(||neri||)
siggu galadaide ninnum̐ jevaṭṭi tīsunā nīvu
vĕggaḽiṁchinā dā viṭravīm̐gum̐ gāga
kagguleni battidaṁṭā kaḍu nādom̐ bŏgaḍevu
niggula yiṁdalimelu nīsatya mĕṟam̐gadā

(||neri||)
yiṁgida mĕṟim̐ginadi yĕduru nīdo navvunā
saṁgadi ninnu bŏmmala jaṁkiṁchum̐ gāga
sĕṁgaḍa nībĕ jūbi sesannalu se sevu
aṁgaḍi āḍigām̐ḍavu adĕṟam̐gavā

(||neri||)
pŏṁdĕrim̐ginavi yaide pŏdugaṁgam̐ jūsunā
kaṁduvala nuṁḍe ninnum̐ galasum̐gāga
yiṁdulo śhrī veṁkaḍeśha yīḍugu nannum̐ gūḍidi
vaṁdālu mālonini nī yarasedive kāvā