నెరవేరెఁ బనులెల్లా నీ భాగ్యమాయ నిఁక
(॥పల్లవి॥)
నెరవేరెఁ బనులెల్లా నీ భాగ్యమాయ నిఁక
వెరగువడి నీవేమి విచారించేవయ్యా
(॥నెర॥)
నెట్టుకొని జవరాలు నీ పాదాలు గుద్దఁగాను
చుట్టి యెవ్వతె కెదురు చూచేవయ్యా
ముట్టి మడిచినయాకు మోవికి నందియ్యఁగాను
గుట్టున లోలలో నేమి గోరేమయ్యా
(॥నెర॥)
సమ్మతించి నీతో నాపై సరసములాడఁగాను
కిమ్ముల నే మాట లాలకించేవయ్యా
కుమ్మెలుగా నురమున కుచముల నొత్తఁగాను
పిమ్మట నెక్కడ పెండ్లిమీఁట యెక్కేవయ్యా
(॥నెర॥)
అలమేలుమంగ నిన్ను నదె కాఁగిలిఁగాను
అలరి యేఁటికి వెరగందేవయ్యా
యిల శ్రీవేంకటేశ న న్నీకె యేలించఁగాను
నలువంక మరియేమి నవ్వు నవ్వేవయ్యా
(||pallavi||)
nĕraverĕm̐ banulĕllā nī bhāgyamāya nim̐ka
vĕraguvaḍi nīvemi visāriṁchevayyā
(||nĕra||)
nĕṭṭugŏni javarālu nī pādālu guddam̐gānu
suṭṭi yĕvvadĕ kĕduru sūsevayyā
muṭṭi maḍisinayāgu movigi naṁdiyyam̐gānu
guṭṭuna lolalo nemi goremayyā
(||nĕra||)
sammadiṁchi nīdo nābai sarasamulāḍam̐gānu
kimmula ne māḍa lālagiṁchevayyā
kummĕlugā nuramuna kusamula nŏttam̐gānu
pimmaḍa nĕkkaḍa pĕṁḍlimīm̐ṭa yĕkkevayyā
(||nĕra||)
alamelumaṁga ninnu nadĕ kām̐gilim̐gānu
alari yem̐ṭigi vĕragaṁdevayyā
yila śhrīveṁkaḍeśha na nnīgĕ yeliṁcham̐gānu
naluvaṁka mariyemi navvu navvevayyā