నేరనివారము మాకు నేరపవయ్య బుద్దులు
(॥పల్లవి॥)
నేరనివారము మాకు నేరపవయ్య బుద్దులు
మేరమీరి మాయంతనే మెప్పించఁగలమా
(॥నేర॥)
వంతువాసులు వుట్టించి వనితల రప్పంచి
సంతవలపులురేఁచిజాజరాడేవు
బంతికూటివారమింతే పందేలువేసి నే మంత
దొంతులపొందులు చేసి తోడుచూపఁగలమా
(॥నేర॥)
వొక్కరికొక్కరు చూడ వొడివట్టి పెనఁగుచు
జక్కవచన్నులు ముట్టి జాజరాడేవు
ప్రక్కనుండేవార మింతేబలిమి సేసి నేమంత
పిక్కటెల్లేనీమోవి పిప్పి సేయఁగలమా
(॥నేర॥)
ఆయము లిందరి కంటి ఆసలెల్లాఁ బుట్టించి
చాయల సన్నలనే జాజరాడేవు
యీయెడ శ్రీవేంకటేశ ఇటు నన్ను నేలితివి
సోయగానఁ గొసరుచు సొలయఁగఁగలమా
(||pallavi||)
neranivāramu māgu nerabavayya buddulu
meramīri māyaṁtane mĕppiṁcham̐galamā
(||nera||)
vaṁtuvāsulu vuṭṭiṁchi vanidala rappaṁchi
saṁtavalabulurem̐sijājarāḍevu
baṁtigūḍivāramiṁte paṁdeluvesi ne maṁta
dŏṁtulabŏṁdulu sesi toḍusūbam̐galamā
(||nera||)
vŏkkarigŏkkaru sūḍa vŏḍivaṭṭi pĕnam̐gusu
jakkavasannulu muṭṭi jājarāḍevu
prakkanuṁḍevāra miṁtebalimi sesi nemaṁta
pikkaḍĕllenīmovi pippi seyam̐galamā
(||nera||)
āyamu liṁdari kaṁṭi āsalĕllām̐ buṭṭiṁchi
sāyala sannalane jājarāḍevu
yīyĕḍa śhrīveṁkaḍeśha iḍu nannu nelidivi
soyagānam̐ gŏsarusu sŏlayam̐gam̐galamā