Nerani jeevulamu neme meṟumgudumu

నేరని జీవులము నేమే మెఱుఁగుదుము
Language

(॥పల్లవి॥)
నేరని జీవులము నేమే మెఱుఁగుదుము
నేరిచిన నీవే మన్నించుటింతే కాక

(॥॥)
చలపట్టి నిన్నును సాదించ వసమా
బలిమి చేసి చేతఁబట్ట వసమా
తలఁపులో నిన్ను నిట్టే తలఁచఁగ వసమా
సులభమై నీవే పొడచూపుటింతే కాక

(॥॥)
మిక్కిలి సేవసేసి మెప్పించ వసమా
అక్కర నీపై భక్తి నంద వసమా
గక్కన నిన్ను నుతించి కడగాన వసమా
దక్కి మాకు నిట్టే ప్రత్యక్షమవుట గాక

(॥॥)
సొంటులు సోదించి నిన్నుఁ జూడఁగ వసమా
అంటి ముట్టి పజించ నది వసమా
బంటనైతి నీమనసు పట్టనైనా వసమా
యింట శ్రీవేంకటేశ నీ విరవౌట గాక

(||pallavi||)
nerani jīvulamu neme mĕṟum̐gudumu
nerisina nīve manniṁchuḍiṁte kāga

(||||)
salabaṭṭi ninnunu sādiṁcha vasamā
balimi sesi sedam̐baṭṭa vasamā
talam̐pulo ninnu niṭṭe talam̐sam̐ga vasamā
sulabhamai nīve pŏḍasūbuḍiṁte kāga

(||||)
mikkili sevasesi mĕppiṁcha vasamā
akkara nībai bhakti naṁda vasamā
gakkana ninnu nudiṁchi kaḍagāna vasamā
dakki māgu niṭṭe pratyakṣhamavuḍa gāga

(||||)
sŏṁṭulu sodiṁchi ninnum̐ jūḍam̐ga vasamā
aṁṭi muṭṭi pajiṁcha nadi vasamā
baṁṭanaidi nīmanasu paṭṭanainā vasamā
yiṁṭa śhrīveṁkaḍeśha nī viravauḍa gāga