Neramuleni padibai nerusu lemchamga nele

నేరములేని పతిపై నెరుసు లెంచఁగ నేలే
Language

(॥పల్లవి॥)
నేరములేని పతిపై నెరుసు లెంచఁగ నేలే
గారవముఁ గాఁతాళముఁ గలుపుదురా

(॥నేర॥)
మాఁటలలోనే తేనెలు మనసులోనే నూనెలు
యేఁటికి నీపతియెడ కింతవలెనా
వాటలలోఁ గొసరులు పరుపుపై నుసురులు
నాటకాన రెండు నిట్టె నడుపుదురా

(॥నేర॥)
చూపులలోనేసిగ్గులు సోఁకులలోనే యెగ్గులు
ఆపొద్దుననుండి యింత అలఇంతురా
చేపట్టులలో మొక్కులు చెనకులలో తొక్కులు
నీపంతాన నివిరెండు నేరుపుదురా

(॥నేర॥)
దవ్వులనే వలపులు దగ్గిరితే బులుపులు
నవ్వుతానే యిటులానే నాలిసేతురా
రవ్వ శ్రీవేంకటేశుఁడు రతి యలమేల్మంగవు
బువ్వపుమోపులు రెండు పొక్కఁజేతురా

(||pallavi||)
neramuleni padibai nĕrusu lĕṁcham̐ga nele
gāravamum̐ gām̐tāḽamum̐ galubudurā

(||nera||)
mām̐ṭalalone tenĕlu manasulone nūnĕlu
yem̐ṭigi nībadiyĕḍa kiṁtavalĕnā
vāḍalalom̐ gŏsarulu parububai nusurulu
nāḍagāna rĕṁḍu niṭṭĕ naḍubudurā

(||nera||)
sūbulalonesiggulu som̐kulalone yĕggulu
ābŏddunanuṁḍi yiṁta ala̮iṁturā
sebaṭṭulalo mŏkkulu sĕnagulalo tŏkkulu
nībaṁtāna nivirĕṁḍu nerubudurā

(||nera||)
davvulane valabulu daggiride bulubulu
navvudāne yiḍulāne nālisedurā
ravva śhrīveṁkaḍeśhum̐ḍu radi yalamelmaṁgavu
buvvabumobulu rĕṁḍu pŏkkam̐jedurā