Neramu lemchaga raave ni nnaadamdu biliseeni

నేరము లెంచక రావే ని న్నాతఁడు బిలిచీని
Language

(॥పల్లవి॥)
నేరము లెంచక రావే ని న్నాతఁడు బిలిచీని
వూరకైన వలపులు వుమురఁ బెట్టేవు

(॥నేరము॥)
మగవాఁడెంత చక్కని మగువ గలిగినాను
మిగుల వేరొకతెతో మేలమాడును
తొగరుఁదామెరలలో తుమ్మిదవంటివాఁడు
వెగటున నీ వేల వెంగెము లాడేవే

(॥నేరము॥)
చెలువుఁ డెంతటి సతి చేఁతలఁదనిపినాను
చెలులచన్నులమీఁద చేయి చాఁచును
చెలఁగి వనములలో చిలుకవంటివాఁడు
కొలఁదిమీర నేల కోపగించేవు

(॥నేరము॥)
శ్రీవేంకటేశుఁడు శ్రీపతి వుర మెక్కినా
బూనానకుఁ బిలుచు భూరమణిని
భావించఁగ నటు గూడే పావురమువంటివాఁడు
తావుకొంటి విలక నేల తమక మందేవే

(||pallavi||)
neramu lĕṁchaga rāve ni nnādam̐ḍu bilisīni
vūragaina valabulu vumuram̐ bĕṭṭevu

(||neramu||)
magavām̐ḍĕṁta sakkani maguva galiginānu
migula verŏgadĕdo melamāḍunu
tŏgarum̐dāmĕralalo tummidavaṁṭivām̐ḍu
vĕgaḍuna nī vela vĕṁgĕmu lāḍeve

(||neramu||)
sĕluvum̐ ḍĕṁtaḍi sadi sem̐talam̐danibinānu
sĕlulasannulamīm̐da seyi sām̐sunu
sĕlam̐gi vanamulalo silugavaṁṭivām̐ḍu
kŏlam̐dimīra nela kobagiṁchevu

(||neramu||)
śhrīveṁkaḍeśhum̐ḍu śhrībadi vura mĕkkinā
būnānagum̐ bilusu bhūramaṇini
bhāviṁcham̐ga naḍu gūḍe pāvuramuvaṁṭivām̐ḍu
tāvugŏṁṭi vilaga nela tamaga maṁdeve