Neramellaa nerubaaya neevamkanu

నేరమెల్లా నేరుపాయ నీవంకను
Language

(॥పల్లవి॥)
నేరమెల్లా నేరుపాయ నీవంకను
యీరీతి నిన్నుదూరి యేమిసేసే మిఁకను

(॥నేర॥)
సిగ్గులు చేతికివచ్చె వింతలు మతికి దక్కె
నిగ్గులయీవనితకు నీవంకను
దగ్గరి నీవే దయదలఁతువుగాక యిఁక
యెగ్గుపట్టి నేము నిన్ను యేమిసేసే మిఁకను

(॥నేర॥)
చెఱఁగు ముంజేత జాఱె చెమట మడుగు గట్టె
నెఱవుగఁ జెలియకు నీవంకను
గిఱికొన మన్నించి కీరితిఁ బొందుదుగాక
యెఱిఁగించితి నిన్ను యేమి సేసే దిఁకను

(॥నేర॥)
పులకలు రాసివడె పొందులు దగ్గరివచ్చె
నిలువులఁ గామినికి నీవంకను
అలరి శ్రీ వేంకటేశ అట్టె కూడితివిగాక
యెలమి నేమెల్లా మొక్కి యేమి సేసే మిఁకను

(||pallavi||)
neramĕllā nerubāya nīvaṁkanu
yīrīdi ninnudūri yemisese mim̐kanu

(||nera||)
siggulu sedigivachchĕ viṁtalu madigi dakkĕ
niggulayīvanidagu nīvaṁkanu
daggari nīve dayadalam̐tuvugāga yim̐ka
yĕggubaṭṭi nemu ninnu yemisese mim̐kanu

(||nera||)
sĕṟam̐gu muṁjeda jāṟĕ sĕmaḍa maḍugu gaṭṭĕ
nĕṟavugam̐ jĕliyagu nīvaṁkanu
giṟigŏna manniṁchi kīridim̐ bŏṁdudugāga
yĕṟim̐giṁchidi ninnu yemi sese dim̐kanu

(||nera||)
pulagalu rāsivaḍĕ pŏṁdulu daggarivachchĕ
niluvulam̐ gāminigi nīvaṁkanu
alari śhrī veṁkaḍeśha aṭṭĕ kūḍidivigāga
yĕlami nemĕllā mŏkki yemi sese mim̐kanu