నేరమెల్లా నా వొళ్లిదే నీవేమి సేతువు
(॥పల్లవి॥)
నేరమెల్లా నా వొళ్లిదే నీవేమి సేతువు
దారిదప్పి సూటిఁబడ దరిచేరే మిదివో
(॥నేర॥)
సేసవెట్టినవాఁడవు చేకొనేవుగాక యిఁక
వేసరేవా యిందువంక వీడీనా పొందు
ఆసపడి తమకాన అలసినదానఁ గాన
వేసినట్టేవేసి నిన్ను వేడుకొనే నిదివో
(॥నేర॥)
వలపించినవాఁడవు వద్దనే వుండేవుగాక
తలఁగేవా యింతలోనే తప్పె నా మాట
బలిమి నీచనవునఁ బరగినదానఁ గాన
పిలిచి నిన్ను జంకించి ప్రేమచల్లే నిదివో
(॥నేర॥)
అంటికూడినవాఁడవు ఆదరించేవుగాకిట్టె
జంట వాసేవా మొగచాటున్నదా
యింటనే శ్రీవేంకటేశ యిరవైనదానఁ గాన
దంటనై నీసరసాన దక్కితి నే నిదివో
(||pallavi||)
neramĕllā nā vŏḽlide nīvemi seduvu
dāridappi sūḍim̐baḍa darisere midivo
(||nera||)
sesavĕṭṭinavām̐ḍavu segŏnevugāga yim̐ka
vesarevā yiṁduvaṁka vīḍīnā pŏṁdu
āsabaḍi tamagāna alasinadānam̐ gāna
vesinaṭṭevesi ninnu veḍugŏne nidivo
(||nera||)
valabiṁchinavām̐ḍavu vaddane vuṁḍevugāga
talam̐gevā yiṁtalone tappĕ nā māḍa
balimi nīsanavunam̐ baraginadānam̐ gāna
pilisi ninnu jaṁkiṁchi premasalle nidivo
(||nera||)
aṁṭigūḍinavām̐ḍavu ādariṁchevugāgiṭṭĕ
jaṁṭa vāsevā mŏgasāḍunnadā
yiṁṭane śhrīveṁkaḍeśha yiravainadānam̐ gāna
daṁṭanai nīsarasāna dakkidi ne nidivo