Nerajaanavu kadunerbarivi

నెరజాణవు కడునేర్పరివి
Language

(॥పల్లవి॥)
నెరజాణవు కడునేర్పరివి
మరిగె నీకె నిన్ను మన్నించవయ్యా

(॥నేర॥)
దొంతులువెట్టీఁ దొయ్యలి వలపులు
పంతపుమాటలఁ బలుమారును
చింతలచిగురులు సిగ్గుల నమ్మీ
చెంతఁ జేరి మచ్చికఁ గొనవయ్యా

(॥నేర॥)
గంపల ముంచీ కాంత కోరికలు
సొంపులచూపులఁ జోక్కుచును
ముంపులతేనెలు మోవినె కురిసీ
జంపులెక కడుఁజవిగొనవయ్యా

(॥నేర॥)
వుయ్యలలూఁగీ నుదుటుఁదమకమున
నెయ్యపు వెరగుల నిక్కుచును
యియ్యడ శ్రీవేంకటేశ యలమేల్‌మంగ
చెయ్యారఁ గూడీని చేకొనవయ్యా

(||pallavi||)
nĕrajāṇavu kaḍunerbarivi
marigĕ nīgĕ ninnu manniṁchavayyā

(||nera||)
dŏṁtuluvĕṭṭīm̐ dŏyyali valabulu
paṁtabumāḍalam̐ balumārunu
siṁtalasigurulu siggula nammī
sĕṁtam̐ jeri machchigam̐ gŏnavayyā

(||nera||)
gaṁpala muṁchī kāṁta korigalu
sŏṁpulasūbulam̐ jokkusunu
muṁpuladenĕlu movinĕ kurisī
jaṁpulĕga kaḍum̐javigŏnavayyā

(||nera||)
vuyyalalūm̐gī nuduḍum̐damagamuna
nĕyyabu vĕragula nikkusunu
yiyyaḍa śhrīveṁkaḍeśha yalamel‌maṁga
sĕyyāram̐ gūḍīni segŏnavayyā