Neṟajaanamdavu neevu nerubarivi

నెఱజాణఁడవు నీవు నేరుపరివి
Language

(॥పల్లవి॥)
నెఱజాణఁడవు నీవు నేరుపరివి
యెఱుఁగ నింకాఁ జేఁత లేమేమి నేరుతువో

(॥నెఱ॥)
చెలఁగి పెక్కుచెలుల చీఁకటిమేడలోఁ బెట్టి
కలగంపగా విభుఁడ కలసితివి
వెలువడి వచ్చి వెలఁదులు నవ్వఁగాను
తెలిసితి గాక నీవే తలఁచుకోఁగలవా

(॥నెఱ॥)
దామెరకొలనిలోన దప్పిదేర నీఁదుతాను
దోమటిరతుల లోలో దొరసితివి
యీమతకములు మీరే యెఱుఁగుదు రింతే కాక
గామిడి మీగు ట్టొరులు కనుఁగొనఁ గలరా

(॥నెఱ॥)
వనకేలి సేయుచోట వడి మంచు గప్పితేను
యెనసితివి శ్రీవేంకటేశ యింతుల
నను గూడితివి యిట్టే నావంటివారే కాక
పనివూని యితరులు భావించఁ గలరా

(||pallavi||)
nĕṟajāṇam̐ḍavu nīvu nerubarivi
yĕṟum̐ga niṁkām̐ jem̐ta lememi neruduvo

(||nĕṟa||)
sĕlam̐gi pĕkkusĕlula sīm̐kaḍimeḍalom̐ bĕṭṭi
kalagaṁpagā vibhum̐ḍa kalasidivi
vĕluvaḍi vachchi vĕlam̐dulu navvam̐gānu
tĕlisidi gāga nīve talam̐sugom̐galavā

(||nĕṟa||)
dāmĕragŏlanilona dappidera nīm̐dudānu
domaḍiradula lolo dŏrasidivi
yīmadagamulu mīre yĕṟum̐gudu riṁte kāga
gāmiḍi mīgu ṭṭŏrulu kanum̐gŏnam̐ galarā

(||nĕṟa||)
vanageli seyusoḍa vaḍi maṁchu gappidenu
yĕnasidivi śhrīveṁkaḍeśha yiṁtula
nanu gūḍidivi yiṭṭe nāvaṁṭivāre kāga
panivūni yidarulu bhāviṁcham̐ galarā