నెఱజాణలైనవారి నేరుపు లివి
(॥పల్లవి॥)
నెఱజాణలైనవారి నేరుపు లివి
మఱవక సేవ సేసి మరిగుండఁ గదవే
(॥॥)
పొందైనందుకు ఫలము పొంచి యెగ్గు పట్టనిదే
విందువెట్టిన ఫలము వేడుక నాదరించేదే
అంది సరసములాడే యందుకు ఫలము నవ్వే
కందువ లెఱిఁగి పతిఁ గలయఁగఁ గదవే
(॥॥)
మనసు లెనయుటకు మంచి మాటలే ఫలము
ననిచిన ఫలము చనవుతో మెలఁగేదే
తనవారైన ఫలము వినయము చూపుటే
చెనకి వీడె మతని చేతి కియ్యఁగదవే
(॥॥)
కూడినందుకు ఫలము కొసరి యలుగనిదే
యీడైనందుకు ఫలము యెన్నఁడుఁ బాయనిదే
వోడక శ్రీవేంకటేశుఁ డొద్దికతో నిన్ను నేలే
పాడి యీతని గుణాలు పచారించఁ గదవే
(||pallavi||)
nĕṟajāṇalainavāri nerubu livi
maṟavaga seva sesi mariguṁḍam̐ gadave
(||||)
pŏṁdainaṁdugu phalamu pŏṁchi yĕggu paṭṭanide
viṁduvĕṭṭina phalamu veḍuga nādariṁchede
aṁdi sarasamulāḍe yaṁdugu phalamu navve
kaṁduva lĕṟim̐gi padim̐ galayam̐gam̐ gadave
(||||)
manasu lĕnayuḍagu maṁchi māḍale phalamu
nanisina phalamu sanavudo mĕlam̐gede
tanavāraina phalamu vinayamu sūbuḍe
sĕnagi vīḍĕ madani sedi kiyyam̐gadave
(||||)
kūḍinaṁdugu phalamu kŏsari yaluganide
yīḍainaṁdugu phalamu yĕnnam̐ḍum̐ bāyanide
voḍaga śhrīveṁkaḍeśhum̐ ḍŏddigado ninnu nele
pāḍi yīdani guṇālu pasāriṁcham̐ gadave