Neṟajaanadanamaide neevale numdavaladaa

నెఱజాణతనమైతే నీవలె నుండవలదా
Language

(॥పల్లవి॥)
నెఱజాణతనమైతే నీవలె నుండవలదా
అఱిముఱి గొప్పు దువ్వే వట్టుండవలదా

(॥నెఱ॥)
సిగ్గువడియున్నచెలిఁ జేయివట్టి తీసుకొని
వొగ్గి తొడపై నిడుక వొడఁబరచి
నిగ్గుల చెలియమోము నీ విట్టే తప్పక చూచి
అగ్గలమై బుజ్జగించే వట్టుండవలదా

(॥నెఱ॥)
తలవంచుక మాటాడేతరుణివదన మెత్తి
చలివాపి వీడె మిచ్చి సరసమాడీ
మొలకనవ్వులు నవ్వి మోవి యిచ్చి గుబ్బలపై
అలరు సరులు దిద్దే వట్టుండవలదా

(॥నెఱ॥)
పాదానఁ దలుపు మీఁటి భావించుకొనె చెలి
పాదుకొనఁ గౌఁగిలించి పచ్చిసేసి
సేదదేర మన్నించి శ్రీవేంకటేశ కూడి
ఆదరించి చెక్కు నొక్కే వట్టుండవలదా

(||pallavi||)
nĕṟajāṇadanamaide nīvalĕ nuṁḍavaladā
aṟimuṟi gŏppu duvve vaṭṭuṁḍavaladā

(||nĕṟa||)
sigguvaḍiyunnasĕlim̐ jeyivaṭṭi tīsugŏni
vŏggi tŏḍabai niḍuga vŏḍam̐barasi
niggula sĕliyamomu nī viṭṭe tappaga sūsi
aggalamai bujjagiṁche vaṭṭuṁḍavaladā

(||nĕṟa||)
talavaṁchuga māḍāḍedaruṇivadana mĕtti
salivābi vīḍĕ michchi sarasamāḍī
mŏlaganavvulu navvi movi yichchi gubbalabai
alaru sarulu didde vaṭṭuṁḍavaladā

(||nĕṟa||)
pādānam̐ dalubu mīm̐ṭi bhāviṁchugŏnĕ sĕli
pādugŏnam̐ gaum̐giliṁchi pachchisesi
sedadera manniṁchi śhrīveṁkaḍeśha kūḍi
ādariṁchi sĕkku nŏkke vaṭṭuṁḍavaladā