నెరజాణ యాటదైతే నిన్నునింత గొసరునా
(॥పల్లవి॥)
నెరజాణ యాటదైతే నిన్నునింత గొసరునా
వెరవెరఁగక నేనే వేసరించేఁ గాక
(॥నెర॥)
యేర నీ వూరకుండఁగానింతట విరుగవద్దా
చేరి వట్టూడిగాలింకాఁ జేసేఁ గాక
యీరీతి నీవుండఁగానింటికిఁ బోవద్దా నేను
వేరై యేమోనీకు విన్నవించేఁ గాక
(॥నెర॥)
పిలువక వుండఁగాను బీరాన నేనుండవద్దా
వలవనిజాలిఁ బడి వచ్చితిఁ గాక
చలముతో నీవుండఁగా చనవులు మానవద్దా
తలఁపులో కాఁతాళాన దగిలేఁ గాక
(॥నెర॥)
పాసి నీవిప్పుడు రాఁగా బలిమి చూపవలదా
ఆసల నిన్నుఁ గాఁగిటనలమేఁ గాక
యీసుదీర శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
వేసరి యలయవద్దా వేగిరించేఁ గాక
(||pallavi||)
nĕrajāṇa yāḍadaide ninnuniṁta gŏsarunā
vĕravĕram̐gaga nene vesariṁchem̐ gāga
(||nĕra||)
yera nī vūraguṁḍam̐gāniṁtaḍa virugavaddā
seri vaṭṭūḍigāliṁkām̐ jesem̐ gāga
yīrīdi nīvuṁḍam̐gāniṁṭigim̐ bovaddā nenu
verai yemonīgu vinnaviṁchem̐ gāga
(||nĕra||)
piluvaga vuṁḍam̐gānu bīrāna nenuṁḍavaddā
valavanijālim̐ baḍi vachchidim̐ gāga
salamudo nīvuṁḍam̐gā sanavulu mānavaddā
talam̐pulo kām̐tāḽāna dagilem̐ gāga
(||nĕra||)
pāsi nīvippuḍu rām̐gā balimi sūbavaladā
āsala ninnum̐ gām̐giḍanalamem̐ gāga
yīsudīra śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
vesari yalayavaddā vegiriṁchem̐ gāga