Nerajaana vinnidaanu nerusugommee

నెరజాణ విన్నిటాను నేరుచుకొమ్మీ
Language

(॥పల్లవి॥)
నెరజాణ విన్నిటాను నేరుచుకొమ్మీ
వొరపైన సరసాలు కుంకువ సొమ్మీ

(॥నెర॥)
కలికి నీకు నంపిన కప్పురపుఁ బలుపులు
చలివేఁడి మోహాలకు చాకిరి సుమ్మీ
అలరి మాచేత నీకు నంపిన యెడమాఁటలు
తలపోఁత ధనానకు దాఁపిరము సుమ్మీ

(॥నెర॥)
పడఁతి నీకు నంపిన బంగారు సుర టిది
అడియాలపు రతుల కాసలు సుమ్మీ
వొడలిపై వ్రాసి నీకు వుత్తరాలుగా నంపె
వడిగొన్న సిగ్గులలో వక్క ణిది సుమ్మీ

(॥నెర॥)
యీవేళ నింతియంపిన యింద్రనీలపుంగరము
భావపు నీ కూటమికి ప్రాణము సుమ్మీ
వావిరి శ్రీ వేంకటేశ వచ్చి నిన్ను సతి గూడె
మోవుల మీ తేనెలు చిమ్ముల విందు సుమ్మీ

(||pallavi||)
nĕrajāṇa vinniḍānu nerusugŏmmī
vŏrabaina sarasālu kuṁkuva sŏmmī

(||nĕra||)
kaligi nīgu naṁpina kappurabum̐ balubulu
salivem̐ḍi mohālagu sāgiri summī
alari māseda nīgu naṁpina yĕḍamām̐ṭalu
talabom̐ta dhanānagu dām̐piramu summī

(||nĕra||)
paḍam̐ti nīgu naṁpina baṁgāru sura ṭidi
aḍiyālabu radula kāsalu summī
vŏḍalibai vrāsi nīgu vuttarālugā naṁpĕ
vaḍigŏnna siggulalo vakka ṇidi summī

(||nĕra||)
yīveḽa niṁtiyaṁpina yiṁdranīlabuṁgaramu
bhāvabu nī kūḍamigi prāṇamu summī
vāviri śhrī veṁkaḍeśha vachchi ninnu sadi gūḍĕ
movula mī tenĕlu simmula viṁdu summī