నెఱజాణ విన్నిటాను నీవెఱఁగవా
(॥పల్లవి॥)
నెఱజాణ విన్నిటాను నీవెఱఁగవా
మఱి నీచిత్తముకొద్ది మమ్ము మన్నించవయ్యా
(॥॥)
చెలిమికొలఁదియే చెల్లుబడి
కలిమికొఁలదియే కాఁపురము
వలపుకొలఁదియే వాడిక
తలపుకొలఁదియే తాలిమి
(॥॥)
పట్టిన కొలఁదియే పంతము
చుట్టరికముకొలఁదే సోబనము
దిట్టతనముకొలఁదే తేఁకువ
నెట్టుకున్న కొలఁదే నిటుకడ
(॥॥)
కూడినకొలఁదియే కూటమి
వేడుకకొలఁదియే విందులు
యీడనెశ్రీ వేంకటేశ యెనసితివి
యీడుజోడైనకొలఁదే యంపలు
(||pallavi||)
nĕṟajāṇa vinniḍānu nīvĕṟam̐gavā
maṟi nīsittamugŏddi mammu manniṁchavayyā
(||||)
sĕlimigŏlam̐diye sĕllubaḍi
kalimigŏm̐ladiye kām̐puramu
valabugŏlam̐diye vāḍiga
talabugŏlam̐diye tālimi
(||||)
paṭṭina kŏlam̐diye paṁtamu
suṭṭarigamugŏlam̐de sobanamu
diṭṭadanamugŏlam̐de tem̐kuva
nĕṭṭugunna kŏlam̐de niḍugaḍa
(||||)
kūḍinagŏlam̐diye kūḍami
veḍugagŏlam̐diye viṁdulu
yīḍanĕśhrī veṁkaḍeśha yĕnasidivi
yīḍujoḍainagŏlam̐de yaṁpalu