Neṟajaana vinnidaanu nee veṟamgavaa

నెఱజాణ విన్నిటాను నీ వెఱఁగవా
Language

(॥పల్లవి॥)
నెఱజాణ విన్నిటాను నీ వెఱఁగవా
యెఱిఁగియును పతి నింత యెలయింతురా

(॥నెఱజాణ॥)
చలము సాదించఁ బోతే సతులు లోఁబడుదురా
వలపించి పైకొనవలెఁ గాక
బలిమిఁ బిసుకఁ బోతే పసురు వేసు విరులు
యెలజవ్వనివి నేఁడు యింత నేతురా

(॥నెఱజాణ॥)
రాజసానఁ దిట్టితేను రామలు మరుగుదురా
తేజమున దగ్గరి బోధింతురు గాక
సాజము దప్పఁగ బోతే సరసమే విరస మౌ
వోజతోడి యీపె నింత వుడికింతురా

(॥నెఱజాణ॥)
పంతాలు నెరపఁ బోతే పడఁతులు లోఁగేరా
చెంత రతులఁ గూడి మెచ్చింతురు గాక
యింతలో శ్రీవెంకటేశ యిద్దరు నేక మయితిరి
అంత కంత కొక రొక రలయింతురా

(||pallavi||)
nĕṟajāṇa vinniḍānu nī vĕṟam̐gavā
yĕṟim̐giyunu padi niṁta yĕlayiṁturā

(||nĕṟajāṇa||)
salamu sādiṁcham̐ bode sadulu lom̐baḍudurā
valabiṁchi paigŏnavalĕm̐ gāga
balimim̐ bisugam̐ bode pasuru vesu virulu
yĕlajavvanivi nem̐ḍu yiṁta nedurā

(||nĕṟajāṇa||)
rājasānam̐ diṭṭidenu rāmalu marugudurā
tejamuna daggari bodhiṁturu gāga
sājamu dappam̐ga bode sarasame virasa mau
vojadoḍi yībĕ niṁta vuḍigiṁturā

(||nĕṟajāṇa||)
paṁtālu nĕrabam̐ bode paḍam̐tulu lom̐gerā
sĕṁta radulam̐ gūḍi mĕchchiṁturu gāga
yiṁtalo śhrīvĕṁkaḍeśha yiddaru nega mayidiri
aṁta kaṁta kŏga rŏga ralayiṁturā