నెరజాణ విభునికి నేర మున్నదా
(॥పల్లవి॥)
నెరజాణ విభునికి నేర మున్నదా
అరమరపుల మతి అలయించీఁ గాక
(॥నెర॥)
తప్పక చూచినవాఁడు తలఁచ కుండీనా నన్ను
కప్పుర మంపివాఁడక్కర సేయఁడా
చిప్పిల నవ్వినవాఁడు చెనక కేఁటికి మాను
దప్పిదేరేవిరహనఁ దమకించేఁ గాక
(॥నెర॥)
మంచి మాటాడినవాఁడు మరుగక యాల మాను
కంచపుపొత్తుచుట్టము కాకు సేసీనా
పొంచి కాచుకున్నవాఁడు పొందు సేయఁడా నాతో
చంచలపుకాఁతాళము చలపట్టీఁ గాక
(॥నెర॥)
ననుపై యుండినవాఁడు నాకుఁ జవ వియ్యఁడా
మనవి చేకొన్నవాఁడు మన్నించఁడా
యెనసె శ్రీవేంకటేశుఁడీడకుఁ దానే వచ్చి
తనిసినసంతోసానఁ దడఁ బడేఁ గాక
(||pallavi||)
nĕrajāṇa vibhunigi nera munnadā
aramarabula madi alayiṁchīm̐ gāga
(||nĕra||)
tappaga sūsinavām̐ḍu talam̐sa kuṁḍīnā nannu
kappura maṁpivām̐ḍakkara seyam̐ḍā
sippila navvinavām̐ḍu sĕnaga kem̐ṭigi mānu
dappiderevirahanam̐ damagiṁchem̐ gāga
(||nĕra||)
maṁchi māḍāḍinavām̐ḍu marugaga yāla mānu
kaṁchabubŏttusuṭṭamu kāgu sesīnā
pŏṁchi kāsugunnavām̐ḍu pŏṁdu seyam̐ḍā nādo
saṁchalabugām̐tāḽamu salabaṭṭīm̐ gāga
(||nĕra||)
nanubai yuṁḍinavām̐ḍu nāgum̐ java viyyam̐ḍā
manavi segŏnnavām̐ḍu manniṁcham̐ḍā
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ḍīḍagum̐ dāne vachchi
tanisinasaṁtosānam̐ daḍam̐ baḍem̐ gāga