నెఱజాణ విభుఁడవు నీవు యిన్ని నేరుతువు
(॥పల్లవి॥)
నెఱజాణ విభుఁడవు నీవు యిన్ని నేరుతువు
తఱితోడ నీ విదివో దయఁ జూచితివి
(॥॥)
కన్నుల నవ్వితివి కానుక చేకొంటివి
విన్నపము లెల్లాను వింటివి నేఁడు
సన్నలఁ జొక్కితివి చనవు లిచ్చితివి
ఇన్నిటా నీ వుపకార మేమని చెప్పుదును
(॥॥)
సరస మాడితివి చవులమో విచ్చితివి
పరిమళములు నాపైఁ బూసితివి
అరుదైన మాటలాడి ఆదరించితివి నన్ను
పరుగ నీచేఁత కెంత సంతోసించు కొందును
(॥॥)
చెలిమి చేకొంటివి సేస నాపైఁ బెట్టి తివి
తలఁపులో నిలిచి చింత వాపితివి
అలమేల్మంగను నేను అంకెల శ్రీ వేంకటేశ
కలసి యేలితివి యీగతి యెట్టు మెత్తును
(||pallavi||)
nĕṟajāṇa vibhum̐ḍavu nīvu yinni neruduvu
taṟidoḍa nī vidivo dayam̐ jūsidivi
(||||)
kannula navvidivi kānuga segŏṁṭivi
vinnabamu lĕllānu viṁṭivi nem̐ḍu
sannalam̐ jŏkkidivi sanavu lichchidivi
inniḍā nī vubagāra memani sĕppudunu
(||||)
sarasa māḍidivi savulamo vichchidivi
parimaḽamulu nābaim̐ būsidivi
arudaina māḍalāḍi ādariṁchidivi nannu
paruga nīsem̐ta kĕṁta saṁtosiṁchu kŏṁdunu
(||||)
sĕlimi segŏṁṭivi sesa nābaim̐ bĕṭṭi tivi
talam̐pulo nilisi siṁta vābidivi
alamelmaṁganu nenu aṁkĕla śhrī veṁkaḍeśha
kalasi yelidivi yīgadi yĕṭṭu mĕttunu