(॥పల్లవి॥)
నేర మింతటికి నేమైతే
ఆరితేరినది యలమేల్మంగ
(॥నేర॥)
కన్నులచూపులు కాఁకలరేఁపులు
వెన్నెలనవ్వులు వెదచల్లీ నదే
చన్నుల నొత్తీ సరఁసుడ నీమై
అన్నిట జాణ యీయలమేల్మంగ
(॥నేర॥)
పెదవుల ముద్దుల పిలుపుల యెలుఁగుల
వదలుఁ బయ్యదనె వలపంచీ నదె
కదులుచు మెచ్చీ ఘనుఁడ నీయెదుట
అదె నేర్పరిగా యలమేల్మంగ
(॥నేర॥)
నయముల మాటల నటనలపాటల
పయిఁ జెయివేయుచు భ్రమయించీ నదే
నియతి శ్రీ వేంకటనిలయ నినుఁ గలసె
అయుతపురతులనె యలమేల్మంగ
(||pallavi||)
nera miṁtaḍigi nemaide
āriderinadi yalamelmaṁga
(||nera||)
kannulasūbulu kām̐kalarem̐pulu
vĕnnĕlanavvulu vĕdasallī nade
sannula nŏttī saram̐suḍa nīmai
anniḍa jāṇa yīyalamelmaṁga
(||nera||)
pĕdavula muddula pilubula yĕlum̐gula
vadalum̐ bayyadanĕ valabaṁchī nadĕ
kadulusu mĕchchī ghanum̐ḍa nīyĕduḍa
adĕ nerbarigā yalamelmaṁga
(||nera||)
nayamula māḍala naḍanalabāḍala
payim̐ jĕyiveyusu bhramayiṁchī nade
niyadi śhrī veṁkaḍanilaya ninum̐ galasĕ
ayudaburadulanĕ yalamelmaṁga