నేర మెన్నఁడును లేదు నెట్టనఁ దనవంకను
(॥పల్లవి॥)
నేర మెన్నఁడును లేదు నెట్టనఁ దనవంకను
వోరుచుకొమ్మనవే నే నొద్దిక మొక్కేను
(॥॥)
కడునాపైఁ దా మచ్చిక గలది నెఱుఁగుదునే
యెడయక మన్నించేది నెఱుఁగుదునే
నడుమ సవతు లట్టే నాతో సరి పెనఁగఁగా
పడలే కతను దూఱి పలుకుదుఁ గాని
(॥॥)
మిక్కిలిఁదా నాకుఁ జేసే మేలూఁ దలఁతునే
తక్కక కరుణించేదీ దలఁతునే
పుక్కట సతులు తనపొందులు చెప్పుకొనఁగ
తక్కక వెస నోపక తను నందుఁ గాని
(॥॥)
అలమి తా నన్నుఁ గూడెనందుకు మెచ్చితినే
మెలఁగి తనరతికి మెచ్చితినే
లలిఁ దా శ్రీ వేంకటేశుఁ డలమేల్మంగనే నేను
వెలయాండ్ల యెమ్మెలు వినినప్పడుఁ గాని
(||pallavi||)
nera mĕnnam̐ḍunu ledu nĕṭṭanam̐ danavaṁkanu
vorusugŏmmanave ne nŏddiga mŏkkenu
(||||)
kaḍunābaim̐ dā machchiga galadi nĕṟum̐gudune
yĕḍayaga manniṁchedi nĕṟum̐gudune
naḍuma savadu laṭṭe nādo sari pĕnam̐gam̐gā
paḍale kadanu dūṟi palugudum̐ gāni
(||||)
mikkilim̐dā nāgum̐ jese melūm̐ dalam̐tune
takkaga karuṇiṁchedī dalam̐tune
pukkaḍa sadulu tanabŏṁdulu sĕppugŏnam̐ga
takkaga vĕsa nobaga tanu naṁdum̐ gāni
(||||)
alami tā nannum̐ gūḍĕnaṁdugu mĕchchidine
mĕlam̐gi tanaradigi mĕchchidine
lalim̐ dā śhrī veṁkaḍeśhum̐ ḍalamelmaṁgane nenu
vĕlayāṁḍla yĕmmĕlu vininappaḍum̐ gāni