Nera mellaa naade kaaga neegum gadama vunnadaa

నేర మెల్లా నాదే కాక నీకుఁ గడమ వున్నదా
Language

(॥పల్లవి॥)
నేర మెల్లా నాదే కాక నీకుఁ గడమ వున్నదా
సారె నమ్మితే రక్షించఁ జాలుదువు మఱి యేలుదువు గాకా

(॥నేర॥)
నీ వెత్తిన వెట్టి మోపునే నడవిఁ బార వేసి
వేవేలు విన్నవించినా విందువా కా దందువు గాక
కావించి నీవు చెప్పిన కర్మఫలము నీ కిచ్చి
యేవి ని న్నడిగినా నీ విత్తువు మఱి మెత్తువు గాక

(॥నేర॥)
చెలఁగి నీవు నియమించిన యానాజ్ఞ దోసి
కొలువుకు వచ్చితేఁ జేకొందువా పొ మ్మందువు గాకా
అల నీవు గల్పించిన యాశ్రమధర్మముననే
కెలన నుండిన బ్రదికింతువూ కృప నింతువు గాకా

(॥నేర॥)
నేరక నీ బంట్లను నిరాకరించి వచ్చి
కూరిమి మొక్కితేఁ గనుఁగొందువా వల దందువు గాక
కోరి పెద్దల సేవించుకొని వారిచేఁ జెప్పించి
చేరితే శ్రీవేంకటేశ చిక్కుదువు మఱి దక్కుదువు గాకా

(||pallavi||)
nera mĕllā nāde kāga nīgum̐ gaḍama vunnadā
sārĕ nammide rakṣhiṁcham̐ jāluduvu maṟi yeluduvu gāgā

(||nera||)
nī vĕttina vĕṭṭi mobune naḍavim̐ bāra vesi
vevelu vinnaviṁchinā viṁduvā kā daṁduvu gāga
kāviṁchi nīvu sĕppina karmaphalamu nī kichchi
yevi ni nnaḍiginā nī vittuvu maṟi mĕttuvu gāga

(||nera||)
sĕlam̐gi nīvu niyamiṁchina yānājña dosi
kŏluvugu vachchidem̐ jegŏṁduvā pŏ mmaṁduvu gāgā
ala nīvu galbiṁchina yāśhramadharmamunane
kĕlana nuṁḍina bradigiṁtuvū kṛpa niṁtuvu gāgā

(||nera||)
neraga nī baṁṭlanu nirāgariṁchi vachchi
kūrimi mŏkkidem̐ ganum̐gŏṁduvā vala daṁduvu gāga
kori pĕddala seviṁchugŏni vārisem̐ jĕppiṁchi
seride śhrīveṁkaḍeśha sikkuduvu maṟi dakkuduvu gāgā