Nenu neevu goosumdamgaa needo sarasamaadi

నేను నీవు గూచుండఁగా నీతో సరసమాడి
Language

(॥పల్లవి॥)
నేను నీవు గూచుండఁగా నీతో సరసమాడి
తానూ నొకతె గలిగెఁ దగులుకోవయ్యా

(॥నేను॥)
చెక్కిటఁ జేయివిట్టి సిగ్గులు నానఁబెట్టి
చక్కనినీమోము చూచీ సకియ
మక్కువ నీకుఁ జేసీ మాటలమందులు వూరి
చక్కెరమోవి చూపీఁ జవిగోనవయ్యా

(॥నేను॥)
నెమ్మి మొక్కె జేతులెత్తి నీకుఁ జూపె తనబత్తి
కమ్మటిఁ బొందుకు లాచీఁ గలికి
కుమ్మరించి తమి వెంచి గుబ్బల నిన్నుఁ దాఁకించి
చిమ్మీఁ గొనగోర నీవూఁ జేరి కూడవయ్యా

(॥నేను॥)
సెలవుల నవ్వు నవ్వి చెలరేఁగి కొప్పుదువ్వి
బలిమిఁ గుచ్చీ నిన్నుఁ బడఁతి
యెలమి శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
అలమితివి నన్నిఁక నాపెను నేలవయ్యా

(||pallavi||)
nenu nīvu gūsuṁḍam̐gā nīdo sarasamāḍi
tānū nŏgadĕ galigĕm̐ dagulugovayyā

(||nenu||)
sĕkkiḍam̐ jeyiviṭṭi siggulu nānam̐bĕṭṭi
sakkaninīmomu sūsī sagiya
makkuva nīgum̐ jesī māḍalamaṁdulu vūri
sakkĕramovi sūbīm̐ javigonavayyā

(||nenu||)
nĕmmi mŏkkĕ jedulĕtti nīgum̐ jūbĕ tanabatti
kammaḍim̐ bŏṁdugu lāsīm̐ galigi
kummariṁchi tami vĕṁchi gubbala ninnum̐ dām̐kiṁchi
simmīm̐ gŏnagora nīvūm̐ jeri kūḍavayyā

(||nenu||)
sĕlavula navvu navvi sĕlarem̐gi kŏppuduvvi
balimim̐ guchchī ninnum̐ baḍam̐ti
yĕlami śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
alamidivi nannim̐ka nābĕnu nelavayyā