Nenoo naabem galigina nerajaanavu

నేనూ నాపెఁ గలిగిన నెరజాణవు
Language

(॥పల్లవి॥)
నేనూ నాపెఁ గలిగిన నెరజాణవు
కానుకగా మీఁదటెత్తు కనుకొనవయ్యా

(॥నేనూ॥)
సగము ముసుఁగువెట్టి సతి నిన్నుఁ దొంగి చూచి
నగి నగి యేమో సన్నలు సేసెను
చిగురుఁ బెదవి వట్టి చిక్కించుక వున్నదాన
తగవెట్టు నెరసేవు తలఁచుకోవయ్యా

(॥నేనూ॥)
దోమతెర గొంత యెత్తి దొమ్మిఁ జేతులు దూరిచి
కామిని వ్రాసిచూపి కాఁక చల్లెను
ఆమని నీరతి నేను అల్లుకొని వున్నదాన
యేమిసేసే విఁక బుద్ది యెంచుకొనవయ్యా

(॥నేనూ॥)
చన్నులు వీఁపున నొత్తి సంగడివారి మొరఁగి
కన్నియ నిన్నిటువలెఁ గాఁగిలించెను
ఇన్నిటా శ్రీ వేంకటేశ ఇద్దరి నే నలముక
యెన్నిఁ గూడితి నిఁక నెట్టు బొంకేవయ్యా

(||pallavi||)
nenū nābĕm̐ galigina nĕrajāṇavu
kānugagā mīm̐daḍĕttu kanugŏnavayyā

(||nenū||)
sagamu musum̐guvĕṭṭi sadi ninnum̐ dŏṁgi sūsi
nagi nagi yemo sannalu sesĕnu
sigurum̐ bĕdavi vaṭṭi sikkiṁchuga vunnadāna
tagavĕṭṭu nĕrasevu talam̐sugovayyā

(||nenū||)
domadĕra gŏṁta yĕtti dŏmmim̐ jedulu dūrisi
kāmini vrāsisūbi kām̐ka sallĕnu
āmani nīradi nenu allugŏni vunnadāna
yemisese vim̐ka buddi yĕṁchugŏnavayyā

(||nenū||)
sannulu vīm̐puna nŏtti saṁgaḍivāri mŏram̐gi
kanniya ninniḍuvalĕm̐ gām̐giliṁchĕnu
inniḍā śhrī veṁkaḍeśha iddari ne nalamuga
yĕnnim̐ gūḍidi nim̐ka nĕṭṭu bŏṁkevayyā