Nenoo meevamtidaanane nerami naagu nede

నేనూ మీవంటిదాననే నేరమి నాకు నేదే
Language

(॥పల్లవి॥)
నేనూ మీవంటిదాననే నేరమి నాకు నేదే
తానకమై యాతనినే తడవరాదా

(॥నేనూ॥)
చలివాయ దినములు సవతిపాళ్లకు వచ్చు
వలపు పాలు వెట్టంగవచ్చునా యేమి
నలువంకఁ జెలులెల్ల నన్నేల వుప్పటించేరే
కొలదిఁమీరఁగఁ బతిఁ గొసరరాదా

(॥నేనూ॥)
ప్రియురాండ్లకు సేసలు పెండ్లివేళఁ బెట్టినట్టు
వయసు వంచిపెట్టఁగవచ్చునా యేమి
నయమెఱఁగక మీరు నన్నేల గోరసేసేరే
దయవుట్ట నాతనిఁ దగులరాదా

(॥నేనూ॥)
అడియాలపుఁగాఁగిట నాతఁ డిందరికిఁ బొత్తు
వడిరూపు పంచిపెట్టఁగవచ్చునా యేమి
చిడుముడి నన్నుఁ గూడె శ్రీవేంకటేశ్వరుఁడు
బడిబడి మీరు నింకాఁ బై కొనరాదా

(||pallavi||)
nenū mīvaṁṭidānane nerami nāgu nede
tānagamai yādanine taḍavarādā

(||nenū||)
salivāya dinamulu savadibāḽlagu vachchu
valabu pālu vĕṭṭaṁgavachchunā yemi
naluvaṁkam̐ jĕlulĕlla nannela vuppaḍiṁchere
kŏladim̐mīram̐gam̐ badim̐ gŏsararādā

(||nenū||)
priyurāṁḍlagu sesalu pĕṁḍliveḽam̐ bĕṭṭinaṭṭu
vayasu vaṁchibĕṭṭam̐gavachchunā yemi
nayamĕṟam̐gaga mīru nannela gorasesere
dayavuṭṭa nādanim̐ dagularādā

(||nenū||)
aḍiyālabum̐gām̐giḍa nādam̐ ḍiṁdarigim̐ bŏttu
vaḍirūbu paṁchibĕṭṭam̐gavachchunā yemi
siḍumuḍi nannum̐ gūḍĕ śhrīveṁkaḍeśhvarum̐ḍu
baḍibaḍi mīru niṁkām̐ bai kŏnarādā