Nenogadi seyamgaanu nee vogadi bhaavimchevu

నేనొకటి సేయఁగాను నీ వొకటి భావించేవు
Language

(॥పల్లవి॥)
నేనొకటి సేయఁగాను నీ వొకటి భావించేవు
ఆనతీవయ్య యింక ననుమాన మేఁటికి

(॥॥)
చనవుగలదంటాను సారె నిన్నుఁ గొసరితి
ననుపుగలదంటాను నవ్వితి నేను
యెనసి యిందుకుఁగాను యేల సిగ్గులు వడేవు
చెనకి నీ యందేమైనా సేఁత గలదొ

(॥॥)
దేవుల నయితినంటా దిష్టించి నిన్నుఁ జూచితి
కైవసమైతివంటాను కాఁగిలించితి
చేవదేర నీవేల శిరసు వంచుకొనేవు
నీవొళ్ళ నేమైనా మరి నేరములు గలవో

(॥॥)
విన్నపము విందువంటా వేవేలు నాడితి
మన్నింతువంటా నిన్నే మరిగుంటిని
యిన్నింటా శ్రీ వేంకటేశ యింతలో నన్నేలితివి
తిన్నఁగా నీవేమి బుద్దిఁ దలఁచుకొంటివో

(||pallavi||)
nenŏgaḍi seyam̐gānu nī vŏgaḍi bhāviṁchevu
ānadīvayya yiṁka nanumāna mem̐ṭigi

(||||)
sanavugaladaṁṭānu sārĕ ninnum̐ gŏsaridi
nanubugaladaṁṭānu navvidi nenu
yĕnasi yiṁdugum̐gānu yela siggulu vaḍevu
sĕnagi nī yaṁdemainā sem̐ta galadŏ

(||||)
devula nayidinaṁṭā diṣhṭiṁchi ninnum̐ jūsidi
kaivasamaidivaṁṭānu kām̐giliṁchidi
sevadera nīvela śhirasu vaṁchugŏnevu
nīvŏḽḽa nemainā mari neramulu galavo

(||||)
vinnabamu viṁduvaṁṭā vevelu nāḍidi
manniṁtuvaṁṭā ninne mariguṁṭini
yinniṁṭā śhrī veṁkaḍeśha yiṁtalo nannelidivi
tinnam̐gā nīvemi buddim̐ dalam̐sugŏṁṭivo