Nenogade namtaa numti nemdu nee kaabe galige

నేనొకతె నంటా నుంటి నేఁడు నీ కాపె గలిగె
Language

(॥పల్లవి॥)
నేనొకతె నంటా నుంటి నేఁడు నీ కాపె గలిగె
మోనాన నుండక నీతో ముచ్చటలాడితిని

(॥నేనొక॥)
అట్టె నాతో మాటలాడి యాడి నడుమనడుమ
ముట్టి వచ్చితే నాకెమొము చూచేవు
దట్టిమై చుట్టాలు నీకు దండ నుండు టెఱుఁగము
వెట్టికే మాటలాడితి వేగినంతా నేను

(॥నేనొక॥)
నంటున నన్ను నవ్వించి నవ్వించి యంతలోనే
కంటకానఁ గన్నుసన్న గావించేవూ
వెంట నీకె తవరులు వేరే వచ్చు టెఱుఁగము
యింటికిఁ బిలుచుకొంటి యేడ కేడో నేను

(॥నేనొక॥)
కూరిమిఁ గౌఁగిట నన్ను కుచ్చి కుచ్చియెడనెడ
చేరి చేరి యాకెవిఁద చేయి వేసేవు
వూరట శ్రీవేంకటేశ వూడిగాలవారి నింత
గారవించు టెఱుఁగను కలసితి నేను

(||pallavi||)
nenŏgadĕ naṁṭā nuṁṭi nem̐ḍu nī kābĕ galigĕ
monāna nuṁḍaga nīdo muchchaḍalāḍidini

(||nenŏga||)
aṭṭĕ nādo māḍalāḍi yāḍi naḍumanaḍuma
muṭṭi vachchide nāgĕmŏmu sūsevu
daṭṭimai suṭṭālu nīgu daṁḍa nuṁḍu ṭĕṟum̐gamu
vĕṭṭige māḍalāḍidi veginaṁtā nenu

(||nenŏga||)
naṁṭuna nannu navviṁchi navviṁchi yaṁtalone
kaṁṭagānam̐ gannusanna gāviṁchevū
vĕṁṭa nīgĕ tavarulu vere vachchu ṭĕṟum̐gamu
yiṁṭigim̐ bilusugŏṁṭi yeḍa keḍo nenu

(||nenŏga||)
kūrimim̐ gaum̐giḍa nannu kuchchi kuchchiyĕḍanĕḍa
seri seri yāgĕvim̐da seyi vesevu
vūraḍa śhrīveṁkaḍeśha vūḍigālavāri niṁta
gāraviṁchu ṭĕṟum̐ganu kalasidi nenu