Neneṟamga jeppare nelamtalaala

నేనెఱఁగ జెప్పరే నెలఁతలాల
Language

(॥పల్లవి॥)
నేనెఱఁగ జెప్పరే నెలఁతలాల
తానే వేసాలు సేసీఁ దగవా యిది

(॥ఇది॥)
చేరి నీవు నాకెంత చెప్పినట్లు సేయకున్నా
వూరటై యిచ్చకపునో రూరకుండదు
అరీతి బుద్దులుచెప్ప నందరూఁ గలరు నీకు
పోరాడనేమిటికి పొద్దువోదు నాకు

(॥ఇది॥)
యీవల నాచెనకులు ఇయ్యకోలు గాకుండినా
సేవసేసేనాచేతులు సిగ్గువడవు
వానితో సరసమాడేవారే నీకు నూరెల్లా
పూవులు నీకు ముడిచేఁ బొద్దువోదు నాకు

(॥ఇది॥)
కందువ నీ విట్టే నన్నుఁ గాఁగిలించుకుండఁగాను
విందుల నాయాసలు వీడుపడవు
సందడి శ్రీవేంకటేశ సారె నన్నుఁ గూడితివి
పొందునఁ దనియ నేను పొద్దేవోదు నాకు

(||pallavi||)
nenĕṟam̐ga jĕppare nĕlam̐talāla
tāne vesālu sesīm̐ dagavā yidi

(||idi||)
seri nīvu nāgĕṁta sĕppinaṭlu seyagunnā
vūraḍai yichchagabuno rūraguṁḍadu
arīdi buddulusĕppa naṁdarūm̐ galaru nīgu
porāḍanemiḍigi pŏdduvodu nāgu

(||idi||)
yīvala nāsĕnagulu iyyagolu gāguṁḍinā
sevasesenāsedulu sigguvaḍavu
vānido sarasamāḍevāre nīgu nūrĕllā
pūvulu nīgu muḍisem̐ bŏdduvodu nāgu

(||idi||)
kaṁduva nī viṭṭe nannum̐ gām̐giliṁchuguṁḍam̐gānu
viṁdula nāyāsalu vīḍubaḍavu
saṁdaḍi śhrīveṁkaḍeśha sārĕ nannum̐ gūḍidivi
pŏṁdunam̐ daniya nenu pŏddevodu nāgu