Neneragamnaa tana nerubulella

నేనెరగఁనా తన నేరుపులెల్ల
Language

(॥పల్లవి॥)
నేనెరగఁనా తన నేరుపులెల్ల
పూని పట్టి యింతయేల బొంకు బొంకీనే

(॥॥)
కతలెన్ని చెప్పినాను కాఁగిలించినట్టు గాదు
మతకములేల తాను మరి సేసీనే
యితవు లెంతసేసినా యెనసినయట్టు గాదు
రతులఁ బెనఁగకేల రవ్వ సేసీనే

(॥॥)
నగవెంత నగినామ నన్నుఁ గూడినట్టు గాదు
యెగసక్కేలెల్ల నాతో నెంత సేసీనే
మొగమెంత చూచినాను మోహించినట్టు గాదు
అగపడి పొందకేల ఆసవెట్టీనే

(॥॥)
మొనగోరెంత సోంకినా మోవి యిచ్చినట్టు గాదు
పెనఁగి నామేనేల బెండుపెట్టీనే
చనవిచ్చి శ్రీవేంకటేశ్వరుఁడు నన్నిపుడేలె
మనసిచ్చి యెంతకెంత మన్నించీనే

(||pallavi||)
nenĕragam̐nā tana nerubulĕlla
pūni paṭṭi yiṁtayela bŏṁku bŏṁkīne

(||||)
kadalĕnni sĕppinānu kām̐giliṁchinaṭṭu gādu
madagamulela tānu mari sesīne
yidavu lĕṁtasesinā yĕnasinayaṭṭu gādu
radulam̐ bĕnam̐gagela ravva sesīne

(||||)
nagavĕṁta nagināma nannum̐ gūḍinaṭṭu gādu
yĕgasakkelĕlla nādo nĕṁta sesīne
mŏgamĕṁta sūsinānu mohiṁchinaṭṭu gādu
agabaḍi pŏṁdagela āsavĕṭṭīne

(||||)
mŏnagorĕṁta soṁkinā movi yichchinaṭṭu gādu
pĕnam̐gi nāmenela bĕṁḍubĕṭṭīne
sanavichchi śhrīveṁkaḍeśhvarum̐ḍu nannibuḍelĕ
manasichchi yĕṁtagĕṁta manniṁchīne