నేనెంతవాఁడను నిన్ను నడిగే నంటే
(॥పల్లవి॥)
నేనెంతవాఁడను నిన్ను నడిగే నంటే
వీనుల నీ కత లెల్లా వినుటే కాకా
(॥నేనెంత॥)
అడిగిన నలుగక యన్యులు మఱి తూరఁ
బలికినాను మారువలుకకా
కలఁచినఁ గలఁగక కసరికొట్టినాను
ములుగనివాఁడు గదా ముక్తికి నర్హుఁడు
(॥నేనెంత॥)
నగిననుఁ దా నగక నాతు లెవ్వరైనాఁ
దగిలి పెనఁగినాఁ దగులకా
వగచినా వగవక వ్రతము చెఱిచే మంటే
మొగమోడకున్నవాఁడే ముక్తికి నర్హుఁడు
(॥నేనెంత॥)
విఱిచినా విఱుగక విష్ణుభక్తి యెడాటాస
వెఱపించినా మఱివెఱవకా
నెఱవై శ్రీవేంకటేశ నీ పాదములే నమ్మి
మొఱఁగు లేనివాఁడే ముక్తికి నర్హుఁడు
(||pallavi||)
nenĕṁtavām̐ḍanu ninnu naḍige naṁṭe
vīnula nī kada lĕllā vinuḍe kāgā
(||nenĕṁta||)
aḍigina nalugaga yanyulu maṟi tūram̐
baliginānu māruvalugagā
kalam̐sinam̐ galam̐gaga kasarigŏṭṭinānu
muluganivām̐ḍu gadā muktigi narhum̐ḍu
(||nenĕṁta||)
naginanum̐ dā nagaga nādu lĕvvarainām̐
dagili pĕnam̐ginām̐ dagulagā
vagasinā vagavaga vradamu sĕṟise maṁṭe
mŏgamoḍagunnavām̐ḍe muktigi narhum̐ḍu
(||nenĕṁta||)
viṟisinā viṟugaga viṣhṇubhakti yĕḍāḍāsa
vĕṟabiṁchinā maṟivĕṟavagā
nĕṟavai śhrīveṁkaḍeśha nī pādamule nammi
mŏṟam̐gu lenivām̐ḍe muktigi narhum̐ḍu