నేనెంత కోపినైన నీకేల చలము
(॥పల్లవి॥)
నేనెంత కోపినైన నీకేల చలము
పూనిపట్టి నాకు నీవు బుద్దిచెప్పరాదా
(॥నేనెం॥)
బీరములాడేవారికి బిరుదులే యెక్కుఁగాక
వోరుపుగలవారికి వొరటున్నదా
నేరుపుగలవాఁడవు నేనేమనిన నీవు
అరితేరి చుట్టమవై అండనే వుండరాదా
(॥నేనెం॥)
తెగువగలవారికి దిమ్ములట్టె రేఁగుఁగాక
మొగమోడేవారికి మోసమున్నదా
తగవరిమాట నీవు తత్తరించి నేమీరితే
నగుతా నన్ను బోదించి నమ్మించరాదా
(॥నేనెం॥)
వాసులువట్టేవారికి వట్టిజోలి మించుగాక
సేసవెట్టినవారికి సిగ్గులున్నవా
ఆసతో శ్రీ వేంకటేశ ఆయములు నేనంటితే
యీసులేక కూడితివి యిఁక మెచ్చరాదా
(||pallavi||)
nenĕṁta kobinaina nīgela salamu
pūnibaṭṭi nāgu nīvu buddisĕpparādā
(||nenĕṁ||)
bīramulāḍevārigi birudule yĕkkum̐gāga
vorubugalavārigi vŏraḍunnadā
nerubugalavām̐ḍavu nenemanina nīvu
arideri suṭṭamavai aṁḍane vuṁḍarādā
(||nenĕṁ||)
tĕguvagalavārigi dimmulaṭṭĕ rem̐gum̐gāga
mŏgamoḍevārigi mosamunnadā
tagavarimāḍa nīvu tattariṁchi nemīride
nagudā nannu bodiṁchi nammiṁcharādā
(||nenĕṁ||)
vāsuluvaṭṭevārigi vaṭṭijoli miṁchugāga
sesavĕṭṭinavārigi siggulunnavā
āsado śhrī veṁkaḍeśha āyamulu nenaṁṭide
yīsulega kūḍidivi yim̐ka mĕchcharādā