నేనెంత గబ్బినైన నీకుఁ బోదుగా
(॥పల్లవి॥)
నేనెంత గబ్బినైన నీకుఁ బోదుగా
నీ నెలఁతనైనఁ గాన నీకుఁ బోదుగా
(॥నేనెం॥)
పెరిగి నాకుచమలు పెద్దపెద్ద కొండలైనా
నెరసులేక సాధించ నీకుఁ బోదుగా
సిరులనా మోవి ఇది చిగురైనా చేవసేయ
నిరతి నోరమణుఁడ నీకుఁ బోదుగా
(॥నేనెం॥)
వలుద నాకురు లివి వంకరకొంకరలైనా
నిలిపి చిక్కుదియ్య నీకుఁ బోదుగా
నలువై నాకన్నులందు నల్లఁదెల గలిగిన
నెలకొని మెచ్చమెచ్చ నీకుఁ బోదుగా
(॥నేనెం॥)
గారవపుఁగాఁగిటను కాలు చేఇ దాఁకినాను
నేరమెల్ల మఱవక నీకుఁ బోదుగా
కూరిమి శ్రీవేంకటేశ కూడితివి నామనసు
నీరైనఁ బాలైన నికుఁ బోదుగా
(||pallavi||)
nenĕṁta gabbinaina nīgum̐ bodugā
nī nĕlam̐tanainam̐ gāna nīgum̐ bodugā
(||nenĕṁ||)
pĕrigi nāgusamalu pĕddabĕdda kŏṁḍalainā
nĕrasulega sādhiṁcha nīgum̐ bodugā
sirulanā movi idi sigurainā sevaseya
niradi noramaṇum̐ḍa nīgum̐ bodugā
(||nenĕṁ||)
valuda nāguru livi vaṁkaragŏṁkaralainā
nilibi sikkudiyya nīgum̐ bodugā
naluvai nāgannulaṁdu nallam̐dĕla galigina
nĕlagŏni mĕchchamĕchcha nīgum̐ bodugā
(||nenĕṁ||)
gāravabum̐gām̐giḍanu kālu sei dām̐kinānu
neramĕlla maṟavaga nīgum̐ bodugā
kūrimi śhrīveṁkaḍeśha kūḍidivi nāmanasu
nīrainam̐ bālaina nigum̐ bodugā