నేనేమిటిదానను నేరుపరి విన్నిటాను
(॥పల్లవి॥)
నేనేమిటిదానను నేరుపరి విన్నిటాను
కానీవయ్యా నీ మాటకుఁ గాదంటినా నేను
(॥నేనేమి॥)
సారె సారె నవ్వితేనే చవుకలవును వలపు
కూరిమి గొసరితేనే గుట్టు గందురు
చేరి చెనకఁ జూచితే సిగ్గులు బయటఁబడు
యీరీతి నీవెరగఁవా ఇందవయ్య కానికె
(॥నేనేమి॥)
అసలు వుట్టించితేనే అంగడిఁబడుఁ బంతాలు
వేసాలఁ బొరలితేనే వెగటౌఁ దమి
బాసలు సేసితేనే పరిసిపోవు నిజము
యీసు నీపై నాకు లేదు ఇందవయ్య కానికె
(॥నేనేమి॥)
మంతనాన వేగించితే మర్మములు సరిదాఁకు
సంతోసాలు రేఁచితేను చనివుట్టును
అంతట శ్రీ వేంకటేశ అలమేల్మంగను నేను
ఇంతలోనే కూడితివి ఇందవయ్య కానికె
(||pallavi||)
nenemiḍidānanu nerubari vinniḍānu
kānīvayyā nī māḍagum̐ gādaṁṭinā nenu
(||nenemi||)
sārĕ sārĕ navvidene savugalavunu valabu
kūrimi gŏsaridene guṭṭu gaṁduru
seri sĕnagam̐ jūside siggulu bayaḍam̐baḍu
yīrīdi nīvĕragam̐vā iṁdavayya kānigĕ
(||nenemi||)
asalu vuṭṭiṁchidene aṁgaḍim̐baḍum̐ baṁtālu
vesālam̐ bŏralidene vĕgaḍaum̐ dami
bāsalu sesidene parisibovu nijamu
yīsu nībai nāgu ledu iṁdavayya kānigĕ
(||nenemi||)
maṁtanāna vegiṁchide marmamulu saridām̐ku
saṁtosālu rem̐sidenu sanivuṭṭunu
aṁtaḍa śhrī veṁkaḍeśha alamelmaṁganu nenu
iṁtalone kūḍidivi iṁdavayya kānigĕ