నేనేమిటిదానను నేరు పెంతగలిగినా
(॥పల్లవి॥)
నేనేమిటిదానను నేరు పెంతగలిగినా
వూని నాకుఁ జనవు నీవొసఁగ నీ భారమే
(॥నేనే॥)
నిక్కముగ నే నెంత నీమీఁద మోహించినాను
నెక్కొని యీడేరించ నీభారమే
వెక్కసమై యేపొద్దు నీవేళ నేఁ గాచుకుండినా
మక్కువతోఁ జేకొని మన్నించ నీభారమే
(॥నేనే॥)
దట్టముగా నే నప్పటి దయవుట్ట మాటాడినా
నెట్టుకొని కరుణించ నీభారమే
చుట్టు చుట్టి నీపై నేను సొలపులు చల్లినాను
చిట్టకము లేక భువిఁ జెల్లించ నీభారమే
(॥నేనే॥)
చెలరేఁగి నేనెంత సేసినాను
నిలిపి మెచ్చులు మెచ్చ నీభారమే
యెలమి శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
అలరఁ గూడితి విఁక నన్నియు నీభారమే
(||pallavi||)
nenemiḍidānanu neru pĕṁtagaliginā
vūni nāgum̐ janavu nīvŏsam̐ga nī bhārame
(||nene||)
nikkamuga ne nĕṁta nīmīm̐da mohiṁchinānu
nĕkkŏni yīḍeriṁcha nībhārame
vĕkkasamai yebŏddu nīveḽa nem̐ gāsuguṁḍinā
makkuvadom̐ jegŏni manniṁcha nībhārame
(||nene||)
daṭṭamugā ne nappaḍi dayavuṭṭa māḍāḍinā
nĕṭṭugŏni karuṇiṁcha nībhārame
suṭṭu suṭṭi nībai nenu sŏlabulu sallinānu
siṭṭagamu lega bhuvim̐ jĕlliṁcha nībhārame
(||nene||)
sĕlarem̐gi nenĕṁta sesinānu
nilibi mĕchchulu mĕchcha nībhārame
yĕlami śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
alaram̐ gūḍidi vim̐ka nanniyu nībhārame