Nenemi yeṟumgudu neeseva sesedaana

నేనేమి యెఱుఁగుదు నీసేవ సేసేదాన
Language

(॥పల్లవి॥)
నేనేమి యెఱుఁగుదు నీసేవ సేసేదాన
వెూనముతోనే పొగడి మొక్కేమయ్యా

(॥॥)
చెప్పరానిమాటలు చెవులొగ్గి వినరాదు
విప్పరానిముడియలు విడువరాదు
చొప్పులెత్తరానిసుద్దులు నీకే తెలుసు
అప్పటి నాతో నేమి ఆనతిచ్చేవయ్యా

(॥॥)
చూపరానిసొమ్ముల మించుకన్నులఁ జూడరాదు
ఆఁపరానిగుణముల నణఁచరాదు
నీపొందుల వేడుకలు నెమ్మది నీకే తెలుసు
యీపొద్దు నాకానతిచ్చే విది యేమయ్యా

(॥॥)
పట్టరాని నీచిత్తము పైకొని చెయిచాఁచరాదు
ముట్టరాని నీనవ్వు ముడువరాదు
యిట్టె శ్రీవేంకటేశ యేలితివి నంన్ను నేఁడు
గుట్టెల్లా నానతిచ్చేవు కొంక కిదేమయ్యా

(||pallavi||)
nenemi yĕṟum̐gudu nīseva sesedāna
vĕూnamudone pŏgaḍi mŏkkemayyā

(||||)
sĕpparānimāḍalu sĕvulŏggi vinarādu
vipparānimuḍiyalu viḍuvarādu
sŏppulĕttarānisuddulu nīge tĕlusu
appaḍi nādo nemi ānadichchevayyā

(||||)
sūbarānisŏmmula miṁchugannulam̐ jūḍarādu
ām̐parāniguṇamula naṇam̐sarādu
nībŏṁdula veḍugalu nĕmmadi nīge tĕlusu
yībŏddu nāgānadichche vidi yemayyā

(||||)
paṭṭarāni nīsittamu paigŏni sĕyisām̐sarādu
muṭṭarāni nīnavvu muḍuvarādu
yiṭṭĕ śhrīveṁkaḍeśha yelidivi naṁnnu nem̐ḍu
guṭṭĕllā nānadichchevu kŏṁka kidemayyā