Nenemi yeṟamganu neeve bhaaragumdavu

నేనేమి యెఱఁగను నీవే భారకుఁడవు
Language

(॥పల్లవి॥)
నేనేమి యెఱఁగను నీవే భారకుఁడవు
మోనముతో నున్నదాన ముచ్చట నీ చేతిది

(॥నేనే॥)
తేనెగా రేనీ మాటల తేటలకే చొక్కితిమి
లోనుండిన నీమనసులోఁతెంతో
ఆనుక బాగాలిచ్చి ఆకు చేతఁబట్టుకొని
నానఁబెట్టుకున్న దాన ననుపు నీచేతిది

(॥నేనే॥)
చవులైన వినయాల సందడి నే మున్నారము
తవిలి నీరతులకు తతి యేదో
జవళిఁ బాదములొత్తి సంగడి మర్మాలు రేఁచి
తవన మీఁదెత్తితిని తగవు నీచేతిది

(॥నేనే॥)
యిచ్చిన నీచవుల యెమ్మెల నోలలాడితి
కచ్చుపెట్టి బోగములకత లేఁటివో
యిచ్చకుఁడ శ్రీ వేంకటేశ నన్నుఁ గూడితివి
యిచ్చలు నీ కాడితిని యిరవు నీచేతిది

(||pallavi||)
nenemi yĕṟam̐ganu nīve bhāragum̐ḍavu
monamudo nunnadāna muchchaḍa nī sedidi

(||nene||)
tenĕgā renī māḍala teḍalage sŏkkidimi
lonuṁḍina nīmanasulom̐tĕṁto
ānuga bāgālichchi āgu sedam̐baṭṭugŏni
nānam̐bĕṭṭugunna dāna nanubu nīsedidi

(||nene||)
savulaina vinayāla saṁdaḍi ne munnāramu
tavili nīradulagu tadi yedo
javaḽim̐ bādamulŏtti saṁgaḍi marmālu rem̐si
tavana mīm̐dĕttidini tagavu nīsedidi

(||nene||)
yichchina nīsavula yĕmmĕla nolalāḍidi
kachchubĕṭṭi bogamulagada lem̐ṭivo
yichchagum̐ḍa śhrī veṁkaḍeśha nannum̐ gūḍidivi
yichchalu nī kāḍidini yiravu nīsedidi