(॥పల్లవి॥)
నేనేమి సేతునే నెలఁతలాల
పూని వెరపు దెలిపి బుద్ది చెప్పరే
(॥నేనేమి॥)
తనమోము చూచితేను తతిగొనీ నాకు నవ్వు
యెనయక తానేల యెగ్గుపట్టీనే
అనువుగా నేనెంత ఆనవెట్టినా నమ్మఁడు
తనచేఁత దలఁచుక తానే యలిగీనే
(॥నేనేమి॥)
పలికితే తాఁ జేసేపనులు తొరలి వచ్చీ
యెలమిఁ దానేల యిందు కెగ్గుపట్టీనే
పలుమారు నిందుకుఁగా బాససేసినా నమ్మఁడు
చెలఁగి తనకుఁ దానే సిగ్గులు వడీనే
(॥నేనేమి॥)
కూడితేను తనవొళ్లి గురుతులు రేఁగీని
యీడనె తానేల యిందు కెగ్గువట్టీనే
ఆడ నంటే శ్రీ వేంకటాధీశుఁడు నమ్మఁడు
వేడుకఁ దనలోఁ దానే విచారించు కొనీనే
(||pallavi||)
nenemi sedune nĕlam̐talāla
pūni vĕrabu dĕlibi buddi sĕppare
(||nenemi||)
tanamomu sūsidenu tadigŏnī nāgu navvu
yĕnayaga tānela yĕggubaṭṭīne
anuvugā nenĕṁta ānavĕṭṭinā nammam̐ḍu
tanasem̐ta dalam̐suga tāne yaligīne
(||nenemi||)
paligide tām̐ jesebanulu tŏrali vachchī
yĕlamim̐ dānela yiṁdu kĕggubaṭṭīne
palumāru niṁdugum̐gā bāsasesinā nammam̐ḍu
sĕlam̐gi tanagum̐ dāne siggulu vaḍīne
(||nenemi||)
kūḍidenu tanavŏḽli gurudulu rem̐gīni
yīḍanĕ tānela yiṁdu kĕgguvaṭṭīne
āḍa naṁṭe śhrī veṁkaḍādhīśhum̐ḍu nammam̐ḍu
veḍugam̐ danalom̐ dāne visāriṁchu kŏnīne