నేనేమి బాఁతే తన నెలఁతలెల్లా నుండఁగ
(॥పల్లవి॥)
నేనేమి బాఁతే తన నెలఁతలెల్లా నుండఁగ
మేనుఁ గాఁగిలించి యేమి మెచ్చీనే నన్నును
(॥నేనే॥)
కందువైననాపై తనకరుణ గురుతుగాక
యిందలో నాచక్కఁదనా లెంతచెప్పీనే
మందలించి నాతోనన్నమాటలే గుఱుతుగాక
పొందుల నానేర్పులెల్ల పొగడీనే తాను
(॥నేనే॥)
కిమ్ముల నన్నేలేతనకీరితే గుఱుతుగాక
యిమ్ముల నామంచిగుణ మేమిచెప్పీనే
సమ్మతించి నాకిచ్చినచనవే గురుతుగాక
పమ్మి నేఁ దనకుఁజేసే బత్తి యెంతో చూపీనే
(॥నేనే॥)
కోరి తా నన్నుఁ గూడినకూటమే గురుతుగాక
యీరీతి నావినయము లేమిసేసీనే
ఆరయ శ్రీవేంకటేశుఁ డలమేల్ మంగను నేను
చేరి నన్నుఁ గూడెను నాచేఁత లేఁటిచేఁతలే
(||pallavi||)
nenemi bām̐te tana nĕlam̐talĕllā nuṁḍam̐ga
menum̐ gām̐giliṁchi yemi mĕchchīne nannunu
(||nene||)
kaṁduvainanābai tanagaruṇa gurudugāga
yiṁdalo nāsakkam̐danā lĕṁtasĕppīne
maṁdaliṁchi nādonannamāḍale guṟudugāga
pŏṁdula nānerbulĕlla pŏgaḍīne tānu
(||nene||)
kimmula nanneledanagīride guṟudugāga
yimmula nāmaṁchiguṇa memisĕppīne
sammadiṁchi nāgichchinasanave gurudugāga
pammi nem̐ danagum̐jese batti yĕṁto sūbīne
(||nene||)
kori tā nannum̐ gūḍinagūḍame gurudugāga
yīrīdi nāvinayamu lemisesīne
āraya śhrīveṁkaḍeśhum̐ ḍalamel maṁganu nenu
seri nannum̐ gūḍĕnu nāsem̐ta lem̐ṭisem̐tale