నేనేమెఱుఁగుదును నీ చేఁతలు
(॥పల్లవి॥)
నేనేమెఱుఁగుదును నీ చేఁతలు
ఆనుక నిన్ను వెంగెములాడేపాటి దాననా
(॥నేనే॥)
ముచ్చట నీవాడఁగాను మొగము చూచితిఁగాక
వొచ్చెములెంచి తప్పు లున్నవంటినా
తచ్చనలు నే నెర తగులువిరులు నేర
యిచ్చల నీవే లోఁగేవు యేమిసేసితివో
(॥నేనే॥)
దగ్గరి నీవు రాఁగాఁ బాదాలు గడిగితిఁగాక
బగ్గన యెవ్వతే దొక్కె పాదమంటినా
వెగ్గళించ నే నేర వెంగమాడ నే నేర
సిగ్గువడే వేపనులు చి త్తములో నున్నవో
(॥నేనే॥)
గక్కన నీవు గూడఁగఁ గాఁగిలించుకొంటిఁగాక
మక్కువతో నిన్ను నే నమ్మకయుంటినా
యిక్కు వెఱిఁగి కూడితి విదివో శ్రీవేంకటేశ
వెక్కసాలు నే నెఱఁగ వేడుక నీకెట్టిదో
(||pallavi||)
nenemĕṟum̐gudunu nī sem̐talu
ānuga ninnu vĕṁgĕmulāḍebāḍi dānanā
(||nene||)
muchchaḍa nīvāḍam̐gānu mŏgamu sūsidim̐gāga
vŏchchĕmulĕṁchi tappu lunnavaṁṭinā
tachchanalu ne nĕra taguluvirulu nera
yichchala nīve lom̐gevu yemisesidivo
(||nene||)
daggari nīvu rām̐gām̐ bādālu gaḍigidim̐gāga
baggana yĕvvade dŏkkĕ pādamaṁṭinā
vĕggaḽiṁcha ne nera vĕṁgamāḍa ne nera
sigguvaḍe vebanulu si ttamulo nunnavo
(||nene||)
gakkana nīvu gūḍam̐gam̐ gām̐giliṁchugŏṁṭim̐gāga
makkuvado ninnu ne nammagayuṁṭinā
yikku vĕṟim̐gi kūḍidi vidivo śhrīveṁkaḍeśha
vĕkkasālu ne nĕṟam̐ga veḍuga nīgĕṭṭido