Nenemee neṟamgam jummee mee semtalu

నేనేమీ నెఱఁగఁ జుమ్మీ మీ చేఁతలు
Language

(॥పల్లవి॥)
నేనేమీ నెఱఁగఁ జుమ్మీ మీ చేఁతలు
పూనిపట్టి నీవేమి బుద్దిదలఁచితివో

(॥నేను॥)
పంతములాడక నిన్ను బళియని మెచ్చితే
చింతతోడఁ దలవంచి సిగ్గువడేవు
వంతుకెక్కిన వెంగె మామరేమైనా నంటినా
కొంత గొంత నీవేఁటికిఁ గొంకేవోకాక

(॥నేను॥)
వాసులెల్లా నెంచక నీ వద్దికి నే వచ్చితేను
వోసరించి మొకమోడి వొడ్డుకొనేవు
నీ సుద్దులు దడవేనా నిన్ను నే సోదించేనా
వీసమంత పనికేల విచారించుకొనేవో

(॥నేను॥)
కన్నుల జంకించక కాఁగిట నే నించితేనే
వెన్నెకాఁడవై కడు వెరగందేవు
యిన్నిటా శ్రీ వేంకటేశ యెరవు నీకుఁ జేసేనా
మన్ననలు నీవెంత మాకియ్య నున్నాఁడవో

(||pallavi||)
nenemī nĕṟam̐gam̐ jummī mī sem̐talu
pūnibaṭṭi nīvemi buddidalam̐sidivo

(||nenu||)
paṁtamulāḍaga ninnu baḽiyani mĕchchide
siṁtadoḍam̐ dalavaṁchi sigguvaḍevu
vaṁtugĕkkina vĕṁgĕ māmaremainā naṁṭinā
kŏṁta gŏṁta nīvem̐ṭigim̐ gŏṁkevogāga

(||nenu||)
vāsulĕllā nĕṁchaga nī vaddigi ne vachchidenu
vosariṁchi mŏgamoḍi vŏḍḍugŏnevu
nī suddulu daḍavenā ninnu ne sodiṁchenā
vīsamaṁta panigela visāriṁchugŏnevo

(||nenu||)
kannula jaṁkiṁchaga kām̐giḍa ne niṁchidene
vĕnnĕgām̐ḍavai kaḍu vĕragaṁdevu
yinniḍā śhrī veṁkaḍeśha yĕravu nīgum̐ jesenā
mannanalu nīvĕṁta māgiyya nunnām̐ḍavo