నేనేమీ ననఁ జుమ్మీ నిన్నుఁ దొలుత
(॥పల్లవి॥)
నేనేమీ ననఁ జుమ్మీ నిన్నుఁ దొలుత
కానుకగా నిన్ను నీవే కాకు సేసుకొందురా
(॥నేనే॥)
తగవు లేమిటికి తప్పు నీయందున్నదా
నగఁగా నీతో నేను నగితిఁగాక
మగిడిమగిడి యాల మర్మము లెత్తుకొనేవు
వెగటుగ నీకునీవే వెల్లవిరు లౌదురా
(॥నేనే॥)
వొడఁబరచగనేల వొద్దంటినా నిన్ను
తడవఁగానే నేనుఁ దడవేఁగాని
బడల నీవే వొళ్లేల పట్టి చూచుకొనేవు
జడిసి నీపై నీవే సడివేసుకొందురా
(॥నేనే॥)
తమకించి కూడితివి దయగలవాఁడవౌదు
భ్రమయఁగా నేను నీతో భ్రమసితిని
అమర శ్రీవేంకటేశ అంటి నన్నుఁ గూడితివి
సమరతులలొ గుట్టు సారె నాడుకొందురా
(||pallavi||)
nenemī nanam̐ jummī ninnum̐ dŏluda
kānugagā ninnu nīve kāgu sesugŏṁdurā
(||nene||)
tagavu lemiḍigi tappu nīyaṁdunnadā
nagam̐gā nīdo nenu nagidim̐gāga
magiḍimagiḍi yāla marmamu lĕttugŏnevu
vĕgaḍuga nīgunīve vĕllaviru laudurā
(||nene||)
vŏḍam̐barasaganela vŏddaṁṭinā ninnu
taḍavam̐gāne nenum̐ daḍavem̐gāni
baḍala nīve vŏḽlela paṭṭi sūsugŏnevu
jaḍisi nībai nīve saḍivesugŏṁdurā
(||nene||)
tamagiṁchi kūḍidivi dayagalavām̐ḍavaudu
bhramayam̐gā nenu nīdo bhramasidini
amara śhrīveṁkaḍeśha aṁṭi nannum̐ gūḍidivi
samaradulalŏ guṭṭu sārĕ nāḍugŏṁdurā