(॥పల్లవి॥)
నేనెందు వోయె తా(యే-దా?) నెందు వోయీ
రానీలే రానీలే రానీలే
(॥నేనెం॥)
మీనైన నాఁటి తన మిడుకెల్ల దిగవలె
కానీలే కానీలే కానీలే
(॥నేనెం॥)
తలచూపేనాఁటి తలఁపెల్ల దిగవలె
తలఁచనీ తలఁచనీ తలఁచనీవే
(॥నేనెం॥)
కిరయైన నాఁటి కిటుకెల్ల దిగవలె
తిరుగనీ తిరుగనీ తిరుగనీవే
(॥నేనెం॥)
హరియైన నాఁటి అదటెల్ల దిగవలె
జరగనీ జరగనీ జరగనీవే
(॥నేనెం॥)
వడుగైన నాఁటి వస విడువఁగ వలె
తడవకు తడవకు తడవకువే
(॥నేనెం॥)
కలుషించే నాఁటి కడమెల్ల దిగవలె
అలుగనీ అలుగనీ అలుగనీవే
(॥నేనెం॥)
సతిఁ బాసేనాఁటి చల్లమెల్ల దిగవలె
తతిగానీ తతిగానీ తతిగానీవే
(॥నేనెం॥)
ముసలైన నాఁటి ముసుపెల్ల దిగవలె
విసుగనీ విసుగనీ విసుగనీవే
(॥నేనెం॥)
మానైన నాఁటి మదమెల్ల దిగవలె
పోనీవే పోనీవే పోనీవే
(॥నేనెం॥)
కలికైన నాఁటి గజరెల్ల దిగవలె
చెలఁగనీ చెలఁగనీ చెలఁగనీవే
(॥నేనెం॥)
వేడుకతో నాఁటి వేంకటపతి నన్నుఁ
గూడనీ కూడనీ కూడనీవే
(||pallavi||)
nenĕṁdu voyĕ tā(ye-dā?) nĕṁdu voyī
rānīle rānīle rānīle
(||nenĕṁ||)
mīnaina nām̐ṭi tana miḍugĕlla digavalĕ
kānīle kānīle kānīle
(||nenĕṁ||)
talasūbenām̐ṭi talam̐pĕlla digavalĕ
talam̐sanī talam̐sanī talam̐sanīve
(||nenĕṁ||)
kirayaina nām̐ṭi kiḍugĕlla digavalĕ
tiruganī tiruganī tiruganīve
(||nenĕṁ||)
hariyaina nām̐ṭi adaḍĕlla digavalĕ
jaraganī jaraganī jaraganīve
(||nenĕṁ||)
vaḍugaina nām̐ṭi vasa viḍuvam̐ga valĕ
taḍavagu taḍavagu taḍavaguve
(||nenĕṁ||)
kaluṣhiṁche nām̐ṭi kaḍamĕlla digavalĕ
aluganī aluganī aluganīve
(||nenĕṁ||)
sadim̐ bāsenām̐ṭi sallamĕlla digavalĕ
tadigānī tadigānī tadigānīve
(||nenĕṁ||)
musalaina nām̐ṭi musubĕlla digavalĕ
visuganī visuganī visuganīve
(||nenĕṁ||)
mānaina nām̐ṭi madamĕlla digavalĕ
ponīve ponīve ponīve
(||nenĕṁ||)
kaligaina nām̐ṭi gajarĕlla digavalĕ
sĕlam̐ganī sĕlam̐ganī sĕlam̐ganīve
(||nenĕṁ||)
veḍugado nām̐ṭi veṁkaḍabadi nannum̐
gūḍanī kūḍanī kūḍanīve