Nenela yaligenu needo nemdu

నేనేల యలిగేను నీతో నేఁడు
Language

(॥పల్లవి॥)
నేనేల యలిగేను నీతో నేఁడు
కానీవయ్యా నీపాదాలకడనే వుందానను

(॥నేనే॥)
యియ్యెడ నన్నేల నీవు యింతేసి వేఁడుకొనేవు
తొయ్యలి నెవ్వతెనైనాఁ దోడి తెత్తునా
పయ్యదకొంగేమిటికి పట్టితియ్యవచ్చేవు
చెరయ్య నానతీవయ్య జేసే నూడిగములు

(॥నేనే॥)
పైకొని నన్నెంత వొడఁబరచఁగవచ్చేవు
యేకాంతకుఁ బంతమిత్తు నేమనేవు
జోకతో నాచెక్కు నొక్కి సోమ్ములెన్ని యిచ్చేవు
యేకడ నీతలఁపున్నా నీడేరించే నేను

(॥నేనే॥)
యిచ్చఁ గాఁగిలించి ప్రియలేల సేసేవు నాకు
మచ్చికసతుల కేడ మాటాలాడేను
అచ్చపు శ్రీవేంకటేశ అలమేల్‌మంగపతివి
యేచ్చుగా నన్నేలితివి యెఱఁగుదు నన్నియూ

(||pallavi||)
nenela yaligenu nīdo nem̐ḍu
kānīvayyā nībādālagaḍane vuṁdānanu

(||nene||)
yiyyĕḍa nannela nīvu yiṁtesi vem̐ḍugŏnevu
tŏyyali nĕvvadĕnainām̐ doḍi tĕttunā
payyadagŏṁgemiḍigi paṭṭidiyyavachchevu
sĕrayya nānadīvayya jese nūḍigamulu

(||nene||)
paigŏni nannĕṁta vŏḍam̐barasam̐gavachchevu
yegāṁtagum̐ baṁtamittu nemanevu
jogado nāsĕkku nŏkki sommulĕnni yichchevu
yegaḍa nīdalam̐punnā nīḍeriṁche nenu

(||nene||)
yichcham̐ gām̐giliṁchi priyalela sesevu nāgu
machchigasadula keḍa māḍālāḍenu
achchabu śhrīveṁkaḍeśha alamel‌maṁgabadivi
yechchugā nannelidivi yĕṟam̐gudu nanniyū