Nene yimdugu nosidi taane amdugu nosenu

నేనే యిందుకు నోచితి తానే అందుకు నోచెను
Language

(॥పల్లవి॥)
నేనే యిందుకు నోచితి తానే అందుకు నోచెను
ఆనలు సారెకు నేటికి అందే చనుమనవే

(॥నేనే॥)
చెక్కునఁబెట్టినచేయి నీ చెంపల జారిన తురుమును
దక్కిన దిదివో నాకును తనతో కూటమిని
చుక్కలలెక్కలమోవియు సొలపులనిద్దుర కన్నులు
చక్కగ నమరెను తనకది సంతోషంబునకే

(॥నేనే॥)
తనువునఁ బొడమేటికాఁకలు దప్పులుదేరేటిమోమును
పనివడి నా పాలాయెను పతితో సరసములా
మనసుల సంతోషంబులు మఱుఁగుల యేకాంతంబులు
తనకే అలవాటాయెను తప్పిఁక లే దనకే

(॥నేనే॥)
పరవశములలో నెలవులు బచ్చనకూటమి కలలును
పరగెను శ్రీవేంకటగిరిపతి ననుఁ గూడఁగను
సురతపువాన వూర్పులు చొక్కేటి సమరతినేర్పులు
యిరవాయెను యిలఁ గొరతలు యిఁక మరి లే వనకే

(||pallavi||)
nene yiṁdugu nosidi tāne aṁdugu nosĕnu
ānalu sārĕgu neḍigi aṁde sanumanave

(||nene||)
sĕkkunam̐bĕṭṭinaseyi nī sĕṁpala jārina turumunu
dakkina didivo nāgunu tanado kūḍamini
sukkalalĕkkalamoviyu sŏlabulaniddura kannulu
sakkaga namarĕnu tanagadi saṁtoṣhaṁbunage

(||nene||)
tanuvunam̐ bŏḍameḍigām̐kalu dappuludereḍimomunu
panivaḍi nā pālāyĕnu padido sarasamulā
manasula saṁtoṣhaṁbulu maṟum̐gula yegāṁtaṁbulu
tanage alavāḍāyĕnu tappim̐ka le danage

(||nene||)
paravaśhamulalo nĕlavulu bachchanagūḍami kalalunu
paragĕnu śhrīveṁkaḍagiribadi nanum̐ gūḍam̐ganu
suradabuvāna vūrbulu sŏkkeḍi samaradinerbulu
yiravāyĕnu yilam̐ gŏradalu yim̐ka mari le vanage