Nene yemtainaanu ninnu viduvalem gaaga

నేనే యెంతైనాను నిన్ను విడువలేఁ గాక
Language

(॥పల్లవి॥)
నేనే యెంతైనాను నిన్ను విడువలేఁ గాక
నానఁబెట్టితే గొడ్డలి నానఁబొయ్యీనా

(॥నేనే॥)
చెలరేఁగి నీకెంత సేవలు చేసినాను
వలపుగలంతె కాక వద్దనుండేవా
మలసి నిన్నప్పటిని మాటలఁ బేలించినాను
తలఁపుకొలఁదే కాకతమకించేవా

(॥నేనే॥)
యెనసి నీతో నెన్నియిచ్చకము లాడినాను
కనుపట్టినంతేకాక కైకొనేవా
చనవుసేసుక మరి సరసములాడినాను
పెనఁగేకొలఁదిగాక ప్రియపడేవా

(॥నేనే॥)
పగటున నిను నెంత పట్టి యెచ్చరించినాను
నగవుకొలఁదేకాక నాటుఁకొనేవా
మిగుల శ్రీవేంకటేశ మెచ్చి నన్నుఁ గూడితివి
మొగమోటకైనాను మోహించకుండేవా

(||pallavi||)
nene yĕṁtainānu ninnu viḍuvalem̐ gāga
nānam̐bĕṭṭide gŏḍḍali nānam̐bŏyyīnā

(||nene||)
sĕlarem̐gi nīgĕṁta sevalu sesinānu
valabugalaṁtĕ kāga vaddanuṁḍevā
malasi ninnappaḍini māḍalam̐ beliṁchinānu
talam̐pugŏlam̐de kāgadamagiṁchevā

(||nene||)
yĕnasi nīdo nĕnniyichchagamu lāḍinānu
kanubaṭṭinaṁtegāga kaigŏnevā
sanavusesuga mari sarasamulāḍinānu
pĕnam̐gegŏlam̐digāga priyabaḍevā

(||nene||)
pagaḍuna ninu nĕṁta paṭṭi yĕchchariṁchinānu
nagavugŏlam̐degāga nāḍum̐kŏnevā
migula śhrīveṁkaḍeśha mĕchchi nannum̐ gūḍidivi
mŏgamoḍagainānu mohiṁchaguṁḍevā