Nene yamdugu raanadaraa

నేనే యందుకు రానటరా
Language

(॥పల్లవి॥)
నేనే యందుకు రానటరా
పోనీపోనీ యింతసేసి వట్టిపొందులనే నిందవేసితి
అట్టే కానీకానీ శ్రీవేంకటరాయా

(॥॥)
చెలులతో నిన్నమాపే చెప్పిపంపనా నీకు
యెలమి మాయింటికి నేలవచ్చితి కానుక లిచ్చితి
వేగిరించితి శ్రీవేంకటరాయా

(॥॥)
నెప్పున మేడపై నీకు నిక్కి సన్న సేయనా
యిప్పుడే చన్నుపట్టేవు యేమిరా నీవే
నేమురా బలిమేలరా శ్రీవేంకటరాయా

(॥॥)
నిచ్చలు మాచన వొలినిలయా నేఁ గోరఁగానే
మెచ్చగా నన్నుఁ గూడి మేలమాడితి
మేలుమేలురా శ్రీవేంకటరాయా

(||pallavi||)
nene yaṁdugu rānaḍarā
ponībonī yiṁtasesi vaṭṭibŏṁdulane niṁdavesidi
aṭṭe kānīgānī śhrīveṁkaḍarāyā

(||||)
sĕlulado ninnamābe sĕppibaṁpanā nīgu
yĕlami māyiṁṭigi nelavachchidi kānuga lichchidi
vegiriṁchidi śhrīveṁkaḍarāyā

(||||)
nĕppuna meḍabai nīgu nikki sanna seyanā
yippuḍe sannubaṭṭevu yemirā nīve
nemurā balimelarā śhrīveṁkaḍarāyā

(||||)
nichchalu māsana vŏlinilayā nem̐ goram̐gāne
mĕchchagā nannum̐ gūḍi melamāḍidi
melumelurā śhrīveṁkaḍarāyā